సినీ నటుడు నాగచైతన్య( Nagachaitanya ) త్వరలోనే తండేల్ ( Thandel )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమాతో నాగచైతన్య కమర్షియల్ సక్సెస్ కొట్టబోతున్నారని అందరూ భావిస్తున్నారు.
గత కొద్దిరోజులుగా నాగచైతన్య వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తి పరమైన జీవితం కూడా పెద్దగా అనుకున్న స్థాయిలో సాగలేదు.

సమంతను( Samantha ) ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయన ఆమెకు విడాకులు ఇచ్చారు.ఇలా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్న చైతు ఆ తర్వాత పలు సినిమాలలో నటించిన ఒకటి కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అనుకోలేక పోయింది.ఇక ఈయన ఇటీవల నటి శోభితను( Sobhita ) రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక వీరిద్దరి వివాహం తర్వాత మొదటి సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం తండేల్.ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను కూడా ఏర్పడ్డాయి.

వరుసగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో బిజీగా గడుపుతున్న నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రేమ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.ఒక నిజమైన ప్రేమలో చాలా బాధ ఉంటుంది.మీరు ఆ బాధను అనుభవించిన తర్వాత దాని నుండి బయటపడినప్పుడు, అది సంబంధాన్ని చాలా భిన్నమైన రీతిలో బంధిస్తుంది.అలాంటి ఒక ప్రయాణాన్ని మీరు ఈ సినిమాలో చూస్తారు .కచ్చితంగా ఈ సినిమా మీకు నచ్చుతుంది అంటూ నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో ఈయన ఈ సినిమా గురించి చెప్పారా లేకపోతే తన వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అంటూ నేటిజన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.