భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ ( Virat Kohli )పై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ( Pat Cummins ) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy ) కోసం ఆసీస్ టీమ్ మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా అభిమానులు భావిస్తున్నారు.
తాజాగా పాట్ కమిన్స్ ఓ యాడ్ వీడియోలో నటించాడు.అందులో షేవింగ్ చేసుకుంటూ అద్దంలో చూసుకుంటూ ‘‘హాయ్ కోహ్లీ, నువ్వు ఇంత నెమ్మదిగా ఆడటం నేను ఎప్పుడూ చూడలేదు.
రీసెంట్‌గా చాలా స్లోగా ఆడావు’’ అంటూ విరాట్ కోహ్లీని టీజ్ చేశాడు.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

అయితే, పాట్ కమిన్స్ చేసిన వ్యాఖ్యలపై విరాట్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు.‘‘కోహ్లీని టీజ్ చేయడమా? ఛాంపియన్స్ ట్రోఫీలో ఆయన మీకు చుక్కలు చూపిస్తాడు’’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.మరోవైపు ఆస్ట్రేలియా టీమ్‌కు ఇప్పటికే పలు సమస్యలు ఎదురవుతున్నాయి.ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ( Mitchell Marsh ) ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమవగా, కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా మెగా టోర్నీలో ఆడటం అనుమానంగా మారింది.
శ్రీలంక పర్యటనకు దూరంగా ఉన్న కమిన్స్ ప్రస్తుతం చీలమండ గాయంతో బాధపడుతున్నాడు.ఈ విషయాన్ని ఆస్ట్రేలియా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ స్వయంగా వెల్లడించారు.

ఒకవేళ పాట్ కమిన్స్ ఆడకపోతే ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ ( Steve Smith ) లేదా ట్రావిస్ హెడ్ ( Travis Head ) కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.ఇకపోతే, తాజాగా కోహ్లీ రన్ ఫామ్ గురించి జరుగుతున్న విమర్శల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ అతనికి కీలకమైన టోర్నీగా మారింది.అభిమానులు మాత్రం అతను తన అసలు శైలి తిరిగి చూపిస్తాడని ఆశిస్తున్నారు.“కింగ్ కోహ్లీ”ని ఇంత త్వరగా తక్కువగా అంచనా వేయడం పొరపాటేనని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.మరి ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ తన పాత ఫామ్ ని తిరిగి సంపాదిస్తాడా?
.






