హైపర్‌పిగ్మెంటేషన్.( Pigmentation ) సాధారణ చర్మ సమస్యల్లో ఇది ఒకటి.
పిగ్మెంటేషన్ కారణంగా చాలా మందికి ముఖంపై ముదురు రంగు మచ్చలు ఏర్పడుతుంటాయి.స్కిన్ కలర్ అన్-ఈవెన్ గా మారుతుంది.
ఎక్కువ సమయం ఎండల్లో ఉండటం, హార్మోనల్ మార్పులు, గాయాలు, అలర్జీలు మరియు ఇన్‌ఫ్లమేషన్ చర్మంపై మెలనిన్( Melanin ) ఉత్పత్తిని పెంచుతాయి.ఇది హైపర్‌పిగ్మెంటేషన్‌కు కారణమవుతుంది.
అయితే ముఖ్యంపై అసహ్యంగా కనిపించే పిగ్మెంటేషన్ మచ్చలను తగ్గించడానికి కొన్ని సహజమైన హోమ్ రెమెడీస్ ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రెమెడీ 1:
పుదీనా ఆకులు.( Mint Leaves ) హైపర్‌పిగ్మెంటేషన్ చికిత్సలో అద్భుతంగా సహాయపడతాయి.పుదీనా ఆకుల్లో ఉండే హైడ్రాసిలిక్ యాసిడ్ చర్మంపై పిగ్మెంటేషన్ మచ్చలు తగ్గిస్తాయి.అందుకోసం కొన్ని ఫ్రెష్ పుదీనా ఆకులను స్మాష్ చేసి జ్యూస్ తీసుకోవాలి.ఈ జ్యూస్ లో వన్ టీ స్పూన్ తేనె( Honey ) కలిపి ముఖానికి మెత్తానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.ఇరవై నిమిషాల అనంతరం ఫేస్ వాష్ చేసుకోవాలి.
రెగ్యులర్ గా ఇలా చేస్తే ముఖంపై పిగ్మెంటేషన్ మచ్చలే కాదు మరే మచ్చలు ఉన్నా మాయం అవుతాయి.

రెమెడీ 2:
టమాటో( Tomato ) మరియు శనగపిండి( Besan Flour ) కాంబినేషన్ పిగ్మెంటేషన్ మచ్చలను సమర్థవంతంగా తొలగిస్తుంది.ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో రెండు టేబుల్ స్పూన్లు టమాటో పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి.
శనగపిండి స్కిన్‌ను న్యూట్రలైజ్ చేసి, శుభ్రముగా ఉండేలా చేస్తుంది.టమాటో ఉండే పోషకాలు పిగ్మెంటేషన్ ను తగ్గించి స్కిన్ కలర్ ను ఈవెన్ గా మారుస్తాయి.

రెమెడీ 3:
రెండు టేబుల్ స్పూన్లు అలోవెర జెల్ లో రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్ మిక్స్ చేస్తే మంచి క్రీమ్ రెడీ అవుతుంది.ఈ క్రీమ్ ను ఫ్రెష్ ఫేస్ పై అప్లై చేసి కనీసం పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.లెమన్ జ్యూస్‌లో సహజమైన సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మంపై మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది.అలాగే అలోవెర జెల్ చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా పిగ్మెంటేషన్‌ను కూడా తగ్గిస్తుంది.







