ముఖ్యంగా చెప్పాలంటే కర్బుజా పండు లో( Water Melon ) అద్భుతమైన పోషకాలు ఉన్నాయని దాదాపు చాలా మందికి తెలుసు.దీనిని ఎక్కువగా ఎండాకాలంలో తీసుకుంటూ ఉంటారు.
ఇందులో ఉండే నీటి శాతం మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.కర్బూజాలను జ్యూస్ రూపంలో లేదా ఘనపదార్థంగా తిన్న డీ హైడ్రేషన్ ను( De-Hydration ) నివారించుకోవచ్చు.
దీన్ని స్వీట్ మెలన్ అని కూడా అంటారు.ఇది తాజాతనాన్ని ఇస్తుంది.
అలాగే వివిధ రకాల పోషకాలను అందించడనికి కూడా ఉపయోగపడుతుంది.ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

ఇది రక్తపోటును ( Blood Pressure ) నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటు కంట్రోల్లో ఉండేందుకు ఉపయోగపడుతుంది.దీన్ని ముక్కలుగా కోసుకొని స్నాక్ లాగా తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి.ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.ఈ పండు తినడం వల్ల పేగుల్లో కదిలికలను నియంత్రించడంలో కూడా సహకరిస్తుంది.దీనిలో 90% నీరు ఉండడం వల్ల డీ హైడ్రేషన్ తగ్గిస్తుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరుస్తాయి.

కొల్లాజెన్( Collagen ) అనే హార్మన్ తో ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం కల్పిస్తుంది.రోజువారి ఆహారంలో దీన్ని చేర్చుకోవడం ద్వారా అనేక పోషకాలు లభిస్తాయి.ఇందులో ఉండే పొటాషియం బిపిని తగ్గిస్తుంది.అసలు బిపిని రానివ్వకుండా కూడా చేస్తుంది.అలాగే రక్తనాళాలను కడిగేస్తుంది.మొత్తం శరీరాన్ని శుభ్రం చేస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ పండు మన ఆహారంలో చేర్చుకుంటే ఎంతో మంచిది.
అది కూడా దీన్ని వేసవికాలంలో తినడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.వర్షాకాలంలో ఈ పండ్లను తినకూడదు.
వేసవిలోనే పుష్కలంగా తింటే మనకు చాలా ప్రయోజనాలు అందుతాయి.ఆరోగ్య సంరక్షణలో కర్బుజా గొప్ప గుణాన్ని కలిగి ఉంటుంది.
ఇలా ఖర్భుజ తో మనం చాలా రకాల మేలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.







