సాధారణంగా ప్రతి ఒక్కరూ ముఖంపై మచ్చలు లేకుండా మెరిసే చర్మం ఉండాలని కోరుకుంటూ ఉంటారు.కానీ ప్రస్తుత సమాజంలో కాలుష్యం కారణంగా గాలిలో ధూళి కణాల సంఖ్య బాగా పెరిగిపోయింది.
ఇది ఆరోగ్యానికి కాకుండా చర్మానికి కూడా హాని కలిగిస్తుంది.ఇది చర్మంపై మంట, డిహైడ్రేషన్, కొల్లాజెన్ దెబ్బ తినడం, నల్ల మచ్చలు, చర్మం ముడతలకు కారణం అవుతుంది.
ఈ పరిస్థితులలో చర్మంపై పేరుకుపోయిన ధూళి కణాల ను దూరం చేసుకోవడం వల్ల మాత్రమే చర్మాన్ని కాపాడుకోవచ్చు.దిని కోసం కొన్ని చిట్కాలను పాటించాలి.ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ముఖాన్ని శుభ్రపరచిన తర్వాత విటమిన్ సి, ఫెరోలిక్ యాసిడ్ కలిగిన సీరమ్‌ను తప్పనిసరిగా అప్లై చేసుకోవడం మంచిది.
ఈ సీరమ్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో ఎంతగానో సాయపడతాయి.విటమిన్ సి రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మంపై నల్ల మచ్చలు, ముడతలు తొలగిపోయి వదులుగా ఉన్న చర్మం మిగుతూగా మారిపోవడం జరుగుతుంది.చర్మ సంరక్షణలో ఎప్పుడూ మాయిశ్చరైజర్ ను ఉపయోగించడం మంచిది.
ఇది చర్మాన్ని ఎంతో హైడ్రేట్ గా మారుస్తుంది.ఇది చర్మాన్ని గాలిలో ఉండే కాలుష్య కణాల నుంచి రక్షించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.

అంతే కాకుండా ఎండలో బయటకు వెళ్లినప్పుడు చర్మానికి సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి.ఇది కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఇంకా చెప్పాలంటే ఎండాకాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ద్రవ పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి.ముఖ్యంగా కొబ్బరి నీరు, పుచ్చకాయ, దోసకాయ వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.వీటిలో ఉండే నీటి శాతం చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.