అమెరికాలో దారుణం.. జాబ్ రాదన్నాడని ప్రియుడిని కాల్చి చంపేసిన గర్ల్‌ఫ్రెండ్..

అమెరికాలోని కొలరాడోలో( Colorado ) ఒక వింతైన షాకింగ్ ఘటన జరిగింది.తన ప్రియుడు ఉద్యోగం( Job ) సంపాదించే సామర్థ్యాన్ని శంకించాడని కోపంతో ఊగిపోయిన ఓ మహిళ, అతడినే చంపేసింది.

 Usa Woman Kills Boyfriend After He Expressed Skepticism About Her Getting A Job-TeluguStop.com

ఈ కేసులో ఆష్లీ వైట్( Ashley White ) అనే మహిళను దోషిగా తేల్చారు.సెకండ్-డిగ్రీ హత్య, హత్య చేయడానికి కుట్ర పన్నడం, దోపిడీ వంటి నేరాలకు ఆమె పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది.2020లో ఆమె ప్రియుడు కోడి డెలిసా( Cody Delisa ) తుపాకీ కాల్పుల్లో మరణించాడు.

వివరాల్లోకి వెళితే, 2020లో ఆష్లీ వైట్ డెన్వర్ నుంచి బస్సులో ఇంటికి తిరిగి వస్తోంది.

తన ప్రియుడు కోడి డెలిసాకు జాబ్ ఇంటర్వ్యూ గురించి మెసేజ్ పెట్టింది.అతడు అనుమానంగా సమాధానమిచ్చాడు.దీంతో ఆమె బాగా హర్ట్ అయింది, కోపం కూడా వచ్చింది.బస్సులోనే ఉండగా, వైట్‌కు “స్కాట్”( Scott ) అని పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి తారసపడ్డాడు.

అతడు ఆమెతో మాట్లాడుతూ నువ్వు రిలేషన్‌షిప్‌లో ఉన్నావా అని, ప్రియుడు ఆమెను రేప్ చేశాడా అని అడిగాడు.

ఆష్లీ అవునని చెప్పింది.వెంటనే స్కాట్ డెలిసాను చంపేయాలని సలహా ఇచ్చాడు.బస్సు దిగిన తర్వాత, వాళ్లిద్దరూ కాసేపు స్కాట్ తుపాకీతో కాల్పులు కూడా జరిపారు.

ఆ తర్వాత ఆష్లీ ఇంటికి నడుచుకుంటూ వెళ్లింది.ఇంటికి చేరుకున్నాక స్కాట్, టెక్సాస్ నుంచి వచ్చిన ఆష్లీ సోదరుడిలా నటించాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే స్కాట్, డెలిసా తలలో రెండుసార్లు కాల్చాడు.మరుసటి రోజు సంక్షేమ తనిఖీలో డెలిసా మృతదేహం బయటపడింది.

హత్య తర్వాత ఆష్లీ, స్కాట్ కలిసి డెలిసా పర్సును దొంగిలించారు.స్కాట్ వెళ్లిపోయే ముందు కొన్ని రోజులు ఆ ప్రాంతంలోనే ఉన్నాడు.ఆ తర్వాత ఆష్లీ అతడిని మళ్లీ ఎప్పుడూ చూడలేదు.పోలీసులు తర్వాత ఆష్లీని అనుమానితురాలిగా గుర్తించారు.ఆమె జరిగినదంతా ఇన్వెస్టిగేటర్లకు చెప్పేసింది.ఆధారాల ప్రకారం ఆమెను అరెస్టు చేసి అభియోగాలు మోపారు.

జిల్లా అటార్నీ బ్రియాన్ మాసన్ ఈ హత్యను “దారుణమైన, అర్థంలేని చర్య” అని అభివర్ణించారు.ఆష్లీ చర్యలే డెలిసా మరణానికి కారణమయ్యాయని, ఆమె ఇప్పుడు శిక్షను అనుభవించాల్సిందేనని ఆయన అన్నారు.

ఆష్లీకు 2025 ఏప్రిల్ 4న జడ్జి జెఫ్రీ రఫ్ శిక్ష ఖరారు చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube