ఇటీవల రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.శరీరానికి అవసరమయ్యే పోషకాలను అందించడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు.
ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి.అందుకే ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల కొంతైనా శ్రద్ధ ఉండాలి.
పోషకాలతో కూడిన ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఎనర్జీ బూస్టర్ లడ్డూ( Energy Booster Laddoo )ను రోజుకొకటి తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగే ఉండదు.
మరి ఆ లడ్డూను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.దాన్ని రోజు తినడం వల్ల వచ్చే ఆరోగ్య లాభాలు ఏంటి.
వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక కప్పు నల్ల నువ్వులు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు గుమ్మడి గింజలు, ఒక కప్పు అవిసె గింజలు( Flax Seeds ) కూడా వేసి వేయించుకోవాలి.చివరిగా నాలుగు టేబుల్ స్పూన్లు గసగసాలు వేసుకొని వేపుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని వేయించి చల్లారపెట్టుకున్న పదార్థాలు అన్నిటిని వేసుకోవాలి.అలాగే ఒక కప్పు బెల్లం తురుము హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి బాగా కలిపి లడ్డూల మాదిరిగా చుట్టుకోవాలి.ఈ లడ్డూలను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజుకు ఒక లడ్డూ చొప్పున వీటిని తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.ఈ లడ్డూలలో క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ప్రోటీన్, ఫైబర్( Fiber ), విటమిన్ ఈ, విటమిన్ ఎ.ఇలా అనేక పోషకాలు నిండి ఉంటాయి.

రోజుకు ఒకటి చొప్పున ఈ లడ్డూను తింటే రక్తహీనత( Anemia ) దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.ఎముకలు దృఢంగా మారతాయి.మోకాళ్ళ నొప్పులు( Knee Pains ) ఉంటే దూరం అవుతాయి.
మెదడు మునుపటి కంటే చురుగ్గా పనిచేస్తుంది.నీరసం అలసట వంటివి వేధించకుండా ఉంటాయి.
జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.మహిళల్లో నెలసరి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.మరియు ఈ లడ్డూలను రోజుకు ఒకటి చొప్పున తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.