భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా( Jasprit Bumrah ) తన అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు.అన్ని ఫార్మాట్లలో తన భీకర బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లను భయబ్రాంతులకు గురిచేస్తున్న బుమ్రా టీమిండియాను ఎన్నో కీలక విజయాల దిశగా నడిపాడు.2024లో టెస్టు క్రికెట్‌లో తన సత్తాను మరింతగా చాటుకున్న బుమ్రా పేస్, స్వింగ్ ను కచ్చితత్వంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.జస్‌ప్రీత్ బుమ్రా 2024లో 13 టెస్టు మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.14.92 బౌలింగ్ యావరేజ్‌తో ఐదుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసి అద్భుత ఫామ్‌లో కనిపించాడు.ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనే 32 వికెట్లు తీసి “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” అవార్డును గెలుచుకున్నాడు.
జస్‌ప్రీత్ బుమ్రా 2024 సంవత్సరానికి గాను “ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్”( ICC Test Cricketer of the Year ) అవార్డును దక్కించుకుని చరిత్ర సృష్టించాడు.2004లో ఐసీసీ ఈ అవార్డులను ప్రారంభించినప్పటి నుంచి టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న తొలి భారత పేసర్‌గా బుమ్రా రికార్డుల్లో నిలిచాడు.ఇప్పటి వరకు ఈ పురస్కారాన్ని భారత తరపున రాహుల్ ద్రవిడ్ (2004), గౌతమ్ గంభీర్ (2009), వీరేంద్ర సెహ్వాగ్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016), విరాట్ కోహ్లీ (2018) పొందారు.
బుమ్రా ఈ జాబితాలో ఆరో భారత ఆటగాడిగా చేరాడు.
ఇటీవల టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని అధిగమించిన బుమ్రా, 20 కంటే తక్కువ బౌలింగ్ యావరేజ్‌తో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు.ప్రస్తుతం ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకుల్లో టాప్ స్థానంలో ఉన్నాడు.మరోవైపు, భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన( Smriti Mandhana ) కూడా 2024లో తన అద్భుత ప్రదర్శనతో ఐసీసీ “ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్”( Women’s ODI Cricketer of the Year ) అవార్డును దక్కించుకుంది.
వన్డేల్లో 747 పరుగులు చేసిన మంధాన ఈ ఘనతను సాధించింది.జస్‌ప్రీత్ బుమ్రా, స్మృతి మంధాన ప్రదర్శనలు భారత క్రికెట్‌కు గర్వకారణంగా నిలిచాయి.