మరమరాలు.వీటినే పేలాలు, బొరుగులు, పఫ్డ్‌రైస్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు.ఎలా పిలిచినా రుచి మాత్రం ఒకటే.చాలా ప్రదేశాల్లో మరమరాలను ఎంతో ఇష్టంగా తీసుకుంటుంటారు. మరమరాలతో చాట్ మరియు స్వీట్లను కూడా తయారు చేస్తారు.ఇక మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ మరమరాలు మంచి ఆహారంగా గుర్తింపు తెచ్చుకున్నాయి.
అయితే చాలా మంది మరమరాలను స్నాక్స్ గా తీసుకుంటారు.కానీ, అవి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి అన్న అవగాహన ఉండదు.
నిజానికి మరమరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.బోలెడన్ని పోషకాలు దాగి ఉన్న మరమరాలు రెగ్యులర్‌గా తీసుకుంటే.అదిరిపోయే హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.మరి ఆ బెనిఫిట్స్ ఏంటీ అన్నది లేట్ చేయకుండా చూసేయండి.
నేటి కాలంలో పాతిక, ముప్పై ఏళ్లు దాటితే చాలు.రక్తపోటు సమస్యతో బాధ పడుతున్నారు.
అయితే సోడియం తక్కవ ఉండే మరమరాలు ప్రతి రోజు తీసుకుంటే గనుక.రక్తపోటు స్థిరంగా ఉంటుంది.
మరియు గుండె జబ్బులకు కూడా దూరంగా ఉండొచ్చు.
అలాగే చాలా మంది బరువు తగ్గించేందుకు ఆకలి వేస్తున్నా ఏమి తినకుండా నోరు కట్టేసుకుంటారు.దాంతో ఇతర అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.అయితే కేలరీలు తక్కువగా ఉండే మరమరాలు తీసుకుంటే.
ఆకలి తగ్గడమే కాదు బరువు కూడా తగ్గుతారు.మరమరాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
ఫైబర్ ఉండే ఆహారం తీసుకున్నా వెయిట్ లాస్ అవ్వొచ్చు.మరమరాల్లో కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది.
కాబట్టి, ప్రతి రోజు తగిన మోతాదులో మరమరాలను డైట్‌లో చేర్చుకుంటే.ఎముకలు, కండరాలు దృఢంగా మారతాయి.
ఇక నేటి కాలంలో ఆడవారు మరియు పిల్లల్లో రక్త హీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.అయితే రక్త హీనత సమస్యను దూరం చేసే ఐరన్ కూడా మరమరాల్లో ఉంటుంది.
అందువల్ల, కచ్చితంగా మరమరాలను డైట్‌లో చేర్చుకుంటే మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
.