జుట్టు రాలడం( Hair Fall ) అనేది మనలో చాలా మందికి అతి పెద్ద సమస్యగా ఉంటుంది.జుట్టు అధికంగా రాలిపోవడం వల్ల కురులు రోజురోజుకు పల్చగా మారిపోతూ ఉంటాయి.
ఈ సమస్యను ఎలా అడ్డుకోవాలో తెలీక నానా తంటాలు పడుతుంటారు.అయితే హెయిర్ ఫాల్ సమస్యను అరికట్టే ఔషధాలు మన వంటింట్లోనే ఎన్నో ఉన్నాయి.
అందులో ఉల్లి తొక్కలు కూడా ఒకటి.ఉల్లి తొక్కలు( Onion Peel ) ఎందుకు పనికి రావని దాదాపు అందరూ వాటిని డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.
కానీ కురుల సంరక్షణకు ఉల్లి తొక్కలు చాలా అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఊడిపోయే జుట్టుకు ఉల్లి తొక్కలతో చెక్ పెట్టవచ్చు.
అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు బియ్యం నానపెట్టుకున్న వాటర్ ను( Rice Water ) పోసుకోవాలి.అలాగే ఒక కప్పు ఉల్లి తొక్కలు, వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( Cloves ) మరియు వన్ టేబుల్ స్పూన్ టీ పొడి వేసి దాదాపు ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె కలిపితే మంచి హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.ఈ న్యాచురల్ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.
టానిక్ అప్లై చేసుకున్న గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ టానిక్ ను కనుక వాడితే జుట్టు రాలడం చాలా వేగంగా కంట్రోల్ అవుతుంది.ఈ టానిక్ జుట్టును మూలాల నుంచి స్ట్రోంగ్ గా మారుస్తుంది.జుట్టు రాలే సమస్యను అడ్డుకుంటుంది.అలాగే ఈ టానిక్ ను వాడటం అలవాటు చేసుకుంటే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.ఊడిన జుట్టు మళ్ళీ మొలుస్తుంది.
కురులు ఒత్తుగా మారతాయి.కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న టానిక్ ను ప్రయత్నించండి.