ఉదయం లేచింది మొదలు ఏదో ఒక విధంగా మనం షుగర్ ను తీసుకుంటూనే ఉంటాం.ముఖ్యంగా నిద్ర లేవగానే తాగే టీ, కాఫీ( Tea, coffee ) లో షుగర్ కచ్చితంగా పడాల్సిందే.
అయితే వైట్ షుగర్ ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మంది ఇటీవల కాలంలో బ్రౌన్ షుగర్ కు అలవాటు పడుతున్నారు.బ్రౌన్ షుగర్ వైట్ షుగర్ కు ఆరోగ్యమైన ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు.
మీరు కూడా ఆరోగ్యానికి మంచిదని బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నారా.అయితే కచ్చితంగా తప్పు చేస్తున్నారు.

బ్రౌన్ షుగర్ సుక్రోజ్ షుగర్ ఉత్పత్తి.బ్రౌన్ షుగర్( Brown sugar ) లో కొన్ని ఖనిజాలు మరియు పోషకాలు ఉన్నప్పటికీ.అవి మీ పోషణకు దోహదపడే మొత్తంలో ఉండవు.పైగా శుద్ధి చేసిన వైట్ షుగర్ మాదిరిగానే బ్రౌన్ షుగర్ లో కూడా కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ లో 15 కేలరీలను కలిగి ఉంటుంది.అలాగే కాల్షియం, పొటాషియం, ఐరన్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలను చిన్న మొత్తంలో కలిగి ఉంటుంది.
పోషక విలువలు తక్కువగా, కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల బ్రౌన్ షుగర్ ఉత్తమమైన ఎంపిక కాదని నిపుణులు చెబుతున్నారు.

అలాగే వైట్ షుగర్ మాదిరిగానే బ్రౌన్ షుగర్ కూడా దంత క్షయాన్ని ప్రోత్సహిస్తుంది.దంతాల ఎనామెల్‌ను క్షీణింపజేసే ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది.బ్రౌన్ షుగర్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి.
కాబట్టి ఆరోగ్యానికి మంచిదని చెప్పి బ్రౌన్ షుగర్ ను ఎడాపెడా వాడేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పుతాయి.మధుమేహం ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం.
అంతేకాదు, బ్రౌన్ షుగర్‌ను అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ మరియు కొన్ని రకాల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.కాబట్టి బ్రౌన్ షుగర్ ను ఎవైడ్ చేయడమే ఉత్తమం అని నిపుణులు చూస్తున్నారు.
వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ కు బదులుగా కోకోనట్ షుగర్, హనీ, మాపుల్ సిరప్, డేట్ షుగర్, స్టెవియా వంటి వాటిని ఎంపిక చేసుకోవచ్చు.