కరోనా వైరస్ కారణంగా మనుషులు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.బయట నుంచి ఏ వస్తువు తీసుకువచ్చిన సరే ఒకటికి రెండు సార్లు కడిగి శానిటైజ్ చేస్తున్నారు.
ఇంకా ఈ నేపథ్యంలోనే కూరగాయలను, పండ్లను కూడా పదేపదే శానిటైజ్ చేస్తున్నారు.అయితే వాటిని శానిటైజ్ చేస్తే ఏం అవుతుంది అనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి.
పండ్లు, కూరగాయలపైన శానిటైజర్ స్ప్రే చేస్తే అందులోని ఆల్కహాల్ ప్రభావానికి పండ్లు, కాయగూరల్లోని పోషకాలు నశిస్తాయి అని.చేస్తే ఒక సమస్య చేయకుంటే మరొక సమస్య అని ఎంతోమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఇంకా ఈ నేపథ్యంలోనే శానిటైజర్ ఉపయోగించకూడదని, సహజసిద్ధంగా తయారు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.
కూరగాయలను, పండ్లను ఉప్పు నీటిలో కడిగి తుడుచుకోవడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.
అతి శుభ్రతతో కూరగాయలను, పండ్లను డిటర్జెంట్ కలిపిన నీటిలో కడుగుతున్నారని, మరికొందరు రసాయనాలు, ఆల్కహాల్ ఉన్న నీటిలో శుభ్రపరుస్తున్నారని దాని వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.