గత ఏడాది సినిమా ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెలిసిందే.కొంతమంది ప్రేమించి వివాహం చేసుకోగా మరి కొంతమంది పెద్దలు కుదిరిచిన వివాహం చేసుకున్నారు.
ఇలా వరుసగా పెళ్లి భాజలు మోగాయి.ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో మతం మార్చుకున్న వారు చాలామంది ఉన్నారు.
కానీ ఒక హీరోయిన్ మాత్రం ఏకంగా పెళ్లి చేసుకోవడం కోసం మతం మార్చుకుంది.ఎమ్మెల్యే కొడుకుతో పెళ్లి కోసం ఆ హీరోయిన్ మతం మార్చుకున్నట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఎవరిని పెళ్లి చేసుకుంది అన్న విషయానికి వస్తే.పెళ్ళైన దాదాపు 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ విషయం బయటపడింది.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్.( Super Movie ) నాగార్జున( Nagarjuna ) హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ఆయేషా టాకియా.( Ayesha Takia ) బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది.కానీ తెలుగులో అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.తెలుగులో అనుకున్న విధంగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది.
అక్కడ వరుస సినిమాలతో బిజీగా మారింది.కెరీర్ పీక్ లో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది.

ప్రముఖ వ్యాపారవేత్త ఫర్హాన్ అజ్మీని( Farhan Azmi ) వివాహం చేసుకుంది ఆయేషా టాకియా.ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకోవడానికి అయేషా టాకియా మతాన్ని మార్చుకుంది.ఫర్హాన్ అజ్మీతో దాదాపుగా మూడేళ్లు డేటింగ్ చేసింది ఈ చిన్నది.సమాజ్వాద్ పార్టీ సీనియర్ నాయకుడు అబూ అజ్మీ( Abu Azmi ) కుమారుడు ఫర్హాన్ అజ్మీ.
అతను రెస్టారెంట్స్ బిజినెస్ ల్లో రాణిస్తున్నాడు.ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకోవడానికి తన మతాన్ని మార్చుకొని ఆయేషా టకియా అజ్మీగా( Ayesha Takia Azmi ) మారిపోయింది.
ఇదే విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది.పెళ్లయిన దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టింది.