వేసవి కాలం( Summer ) రాబోతోంది.శీతాకాలం ముగింపు దశకు చేరుకుంది.
మెల్లమెల్లగా ఎండలు పెరుగుతున్నాయి.అధిక ఉష్ణోగ్రతలు శరీర ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అందుకే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.అయితే మంచి ఆరోగ్యం కోసం వేసవిలో హైడ్రేటెడ్ గా ఉండడం చాలా అవసరం.
ఈ నేపథ్యంలోనే వేసవికాలంలో మిమ్మల్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడే బెస్ట్ డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పుచ్చకాయ జ్యూస్( Watermelon Juice ).వేసవి కాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎటువంటి చక్కెర యాడ్ చేయకుండా పుచ్చకాయ జ్యూస్ తయారు చేసుకుని తీసుకుంటే శరీరంలో నీటి నిల్వలు తగ్గకుండా ఉంటాయి.
ఒత్తిడి, అలసట దూరం అవుతాయి.మరియు పుచ్చకాయలో ఉండే పోషకాలు కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగు పరుస్తాయి.

అలాగే వేసవికాలంలో లెమన్ జ్యూస్ ఒక క్లాసిక్ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు.వాటర్ లో నిమ్మరసం, తేనె కలిపి సమ్మర్ సీజన్ లో తీసుకుంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు.వేసవి వేడిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.పైగా లెమన్ జ్యూస్ జీర్ణ సంబంధిత సమస్యలకు సైతం అడ్డుకట్ట వేస్తుంది.సమ్మర్ సీజన్ లో తీసుకోదగ్గ ఉత్తమ పానీయాల్లో కొబ్బరినీళ్లు ఒకటి.కోకోనట్ వాటర్ లో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి.
అందువల్ల కొబ్బరి నీళ్లు మీ శరీరం యొక్క ద్రవాలు మరియు ఖనిజాలను తిరిగి నింపడంలో అద్భుతంగా తోడ్పడతాయి.కొబ్బరి నీళ్లు ఎనర్జీ బూస్టర్ గా పని చేస్తాయి.

ఇక ఈ రాబోయే వేసవికాలంలో మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి కీర దోసకాయ పుదీనా ( Cucumber )ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కూడా గ్రేట్ గా సహాయపడతాయి.ఈ వాటర్ ను తయారీ కోసం ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో నాలుగు నుంచి ఐదు కీరా దోసకాయ స్లైసెస్ తో పాటు 10 క్రష్ చేసిన ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకోవాలి.ఆపై గ్లాస్ జార్ నిండా వాటర్ పోసుకుని బాగా కలిపి మూత పెట్టి కనీసం ఐదు గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి.ఆపై ఈ వాటర్ ను తీసుకోవాలి.
ఈ పానీయం ఎండల తీవ్రతను తట్టుకునే సామర్థ్యాన్ని మీకు అందిస్తుంది.వడదెబ్బ బారిన పడకుండా రక్షిస్తుంది.