డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Director Prashanth Neel ) గురించి మనందరికీ తెలిసిందే.ఇప్పటివరకు ప్రశాంతి నీల్ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయి.
కాగా చివరగా ప్రశాంత్ నీల్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్( Salaar ) సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే.ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాతో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.
ఈ సినిమాతో బోలెడంత పాపులారిటీని సంపాదించుకున్నాడు పృథ్వీరాజ్.

ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్( NTR ) తో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో అద్భుతంగా ఎదురుచూస్తున్నారు.
అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వినిపించిన వార్తలన్నీ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి.తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అదేమిటంటే ఎన్టీఆర్ సినిమా కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరొక మలయాళ నటుడిని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.

అతను మరెవరో కాదు టొవినో థామస్.( Tovino Thomas ) ఇప్పటికే ఆయనను సంప్రదించగా సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది.ఇకపోతే ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ హీరోయిన్ గా రుక్మిణీ వసంత్( Rukmini Vasanth ) నటిస్తున్నారు.పీరియాడిక్ కథతో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్, సలార్ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఉన్నాయి.మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి మరి.అలాగే ఈ కాంబో మూవీ 2026 లో విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది.