చూసేందుకు అందంగా, తినేందుకు రుచిగా ఉండే పచ్చి బఠానీలను కూరల్లో విరి విరిగా ఉపయోగిస్తాయి.అలాగే ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, విటమిన్ ఎ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, ఫ్లేవనాయిడ్స్ , కెరోటినాయిడ్స్ , ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇలా అనేక పోషక విలువలు ఉండటం వల్ల పచ్చి బఠానీలు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి.
అందులోనూ పురుషులైతే వీటిని అస్సలు వదలకూడదు.ఎందు కంటే, పచ్చి బఠానీలు మగ వారికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి.
మరి ఆలస్యమెందుకు ఆ ఉపయోగాలు ఏంటో చూసేయండి.
ఇటీవల కాలంలో చాలా మంది పురుషులు సంతాన సంబంధిత సమస్యలతో తెగ సతమతమైపోతున్నారు.
అయితే అలాంటి వారు తరచూ పచ్చి బఠానీలను తీసుకుంటే.అందులోని పలు పోషకాలు వీర్య కణాల సంఖ్యను వృద్ధి చేయడంతో పాటుగా వాటి కదలికలనూ వేగ వంతం చేస్తాయి.
అదే సమయంలో వీర్య కణాల ఎదుగుదలకు అవసరమైన హార్మోన్ల ఉత్పత్తిని సైతం పెంచుతాయి.తద్వారా సంతానోత్పత్తి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
అలాగే స్త్రీలతో పోలిస్తే పురుషుల్లోనే గుండె పోటు వచ్చే రిస్క్ ఎక్కువ.

అయితే పచ్చి బఠానీలను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే గనుక.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి గుండె ఆరోగ్య వంతంగా మారుతుంది.తద్వారా గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

అంతేకాదు, పురుషులు తమ డైట్‌లో పచ్చి బఠానీలను చేర్చుకుంటే.కండరాలు దృఢంగా మారతాయి.బరువు అదుపులో ఉంటుంది.రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది.శరీరంలో ఐరన్, ప్రోటీన్ వంటి పోషకాల కొరత ఏర్పడకుండా ఉంటుంది.జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.
మరియు కంటి చూపు సైతం పెరుగుతుంది.