గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna )మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ( Young Tiger Jr.NTR )మధ్య ఒకప్పుడు ఎంతో అనుబంధం ఉండేది.హరికృష్ణ మృతి చెందిన సమయంలో సైతం బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ కు అండగా నిలబడటంతో పాటు తారక్ సినిమాల ఈవెంట్లకు హాజరు కావడం జరిగింది.అయితే గత కొన్నేళ్లుగా బాలయ్య, తారక్ కలిసి కనిపించిన సందర్భాలు అయితే లేవు.
అన్ స్టాపబుల్ షోకు( unstoppable show ) ఎంతోమంది స్టార్ హీరోలు హాజరు కాగా టైర్1 హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం హాజరు కాలేదు.జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు అనడానికి బదులుగా బాలయ్య ఎన్టీఆర్ ను ఈ షోకు ఇన్వైట్ చేయలేదని చెప్పడం కరెక్ట్ అని చెప్పవచ్చు.
అయితే లోకేశ్ తాజాగా చేసిన కొన్ని కామెంట్లు బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ బంధం గురించి చెప్పిన కామెంట్లు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలా మావయ్య చాలా ఎమోషనల్ అని మరో అల్లుడు భరత్ అంటే బాలయ్యకు చాలా ఇష్టమని నారా లోకేశ్ ( Nara Lokesh )పేర్కొన్నారు.బాలా మావయ్య ఎవరినైనా ప్రేమిస్తే ఎంత ప్రేమిస్తారో దూరం పెడితే అంతే దూరంగా ఉంటారని నారా లోకేశ్ తెలిపారు.బాలయ్య ఎన్టీఆర్ రిలేషన్ గురించి లోకేశ్ ఈ కామెంట్స్ చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ మాత్రం బాలయ్యతో గ్యాప్ గురించి ఎప్పుడూ స్పందించలేదు.

బాలయ్య, ఎన్టీఆర్ ప్రస్తుతం మాస్ సినిమాలతో, పాన్ ఇండియా సినిమాలతో పూర్తిస్థాయిలో బిజీగా ఉన్నారు.బాలయ్య ఎన్టీఆర్ పారితోషికాలు సైతం భారీ స్థాయిలో ఉన్నాయి.ఇండస్ట్రీని షేక్ చేసే కథలకు ఈ హీరోలు ప్రాధాన్యత ఇస్తున్నారు.
బాలయ్య, ఎన్టీఆర్ క్రేజ్ అంచనాలను మించి పెరుగుతుండటం గమనార్హం.ఎన్టీఆర్ వార్2 సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.వార్2 సినిమా ఈ ఏడాది ఆగష్టు నెల 14వ తేదీన థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.