మనల్ని అందంగా ఆకర్షణీయంగా చూపించే వాటిలో జుట్టు ఒకటి.జుట్టు ఒత్తుగా ఉంటే మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తారు.
కానీ హెయిర్ ఫాల్( Hair fall ) కారణంగా చాలా మంది జుట్టు పల్చగా మారిపోతుంటుంది.స్త్రీలే కాదు పురుషులు కూడా పల్చటి జుట్టుతో సతమతం అవుతుంటారు.
హెయిర్ ను థిక్ గా మార్చుకునేందుకు తహతహలాడుతుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ హెయిర్ టానిక్ ఉత్తమంగా సహాయపడుతుంది.
ఈ టానిక్ ను వారానికి ఒక్కసారి వాడినా రిజల్ట్ అదిరిపోతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెయిర్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ లవంగాలు( cloves ) వేసుకోవాలి.అలాగే రెండు అంగుళాల అల్లం తీసుకుని తొక్క తొలగించి మెత్తగా దంచి అందులో వేసుకోవాలి.చివరిగా రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( fenugreek ) మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలిపి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు నానబెట్టుకున్న పదార్థాలను స్టవ్ పై పెట్టి కనీసం పది నిమిషాల పాటు ఉడికించాలి.
ఆపై ఉడికించిన పదార్థాలను స్మాష్ చేసుకుని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ఆవ నూనె, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
తద్వారా మన హెయిర్ టానిక్ అనేది సిద్ధం అవుతుంది.

ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.ఈ టానిక్ హెయిర్ గ్రోత్ ను అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తుంది.
జుట్టు రాలటాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.జుట్టు మూడింతలు పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
పల్చటి జుట్టు ఉన్నవారు ప్రతివారం ఈ టానిక్ ను వాడారంటే కొద్ది రోజుల్లో మీ కురులు దట్టంగా మారడం ఖాయం.