మెనోపాజ్. ఈ పేరు వింటేనే ఆడవారు భయపడుతుంటారు.నెలసరి ఆగిపోవడాన్నే మెనోపాజ్ అంటారు.అప్పటి వరకు ప్రతినెలా క్రమం తప్పకుండా వచ్చే పీరియడ్స్.యాబై, అరవై ఏళ్లు వచ్చే సరికి ఒక్క సారిగా ఆగిపోతాయి.ఇక మెనోపాజ్ సమయంలో అనేక సమస్యలు కూడా చుట్టేస్తుంటాయి.
ముఖ్యంగా అధిక బరువు, యోని పొడిబారడం, తలనొప్పి, లైంగిక చర్య మీద అనాసక్తి, అతిగా చెమటలు పట్టడం, మూత్రాశయ, మూత్రనాళ సమస్యలు, ఙ్ఞాపకశక్తి మందగించటం ఇలా అనేక అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది.
అందుకే మెనోపాజ్ అంటేనే ఆడవారు టెన్షన్ పడిపోతుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఫాలో అయితే.మెనోపాజ్ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
మరి ఆ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి సమృద్ధిగా అందేలా చూసుకోవాలి.
అంటే తాజా పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు డైట్‌లో చేర్చుకోవాలి.అలాగే క్రమం తప్పకుండా కనీసం ఇరవై నిమిషాలు అయినా వ్యాయామం చేయాల్సి ఉంటుంది.

ప్రతి రోజు శరీరానికి తగినంత నీరు తీసుకోవాలి.మెనోపాజ్ సమయంలో డీహైడ్రేషన్ ఎక్కువగా ఎదురవుతుంది.అందువల్ల, రోజుకు కనీసం మూడు లీటర్ వాటర్‌ను తీసుకోవాలి.డిప్రెషన్ వంటి ఛాయలు కూడా మెనోపాజ్ దశలో ఎక్కువగా కనిపిస్తుంది.కాబట్టి, ఆ సమయంలో ఒంటరిగా ఉండకుండా అందరితో హ్యాపీగా గడుపుతూ.ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి.
అలాగే సోయా బీన్స్, సోయా పాలు, టోఫు, అవిసె గింజలు, నువ్వులు, బీన్స్,పెరుగు, పాలు, జున్ను వంటి ఆహారాలు మెనోపాజ్ సమస్యలను దూరం చేయడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.కాబట్టి, వీటిని డైట్‌లో చేర్చుకోవాలి.
ఇక మెనోపాజ్ సమయంలో కాఫీ, టీ, మద్యం, సిగరెట్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.లేదంటే మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలు మరింత రెట్టింపు అవుతాయి.