పొడవాటి జుట్టు కోసం ఆశపడుతున్నారా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!

సాధారణంగా చాలా మందికి పొడవాటి జుట్టు( Long Hair ) కావాలని కోరిక ఉంటుంది.కానీ జుట్టుకు సరైన పోషణ అందకపోవడం, ఒత్తిడి, జుట్టు చివర్లు చిట్లి పోవడం, కాలుష్యం తదితర కారణాల వల్ల హెయిర్ పెరగడం ఆగిపోతుంటుంది.

 Try This Home Remedy For Getting Long Hair!, Home Remedy, Long Hair, Hair Serum,-TeluguStop.com

దాంతో పొడవాటి జుట్టు కావాల‌నే కోరిక కోరికగానే మిగిలిపోతుంటుంది.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే మీ కోరిక నెరవేరడం ఖాయం.

ఈ రెమెడీ జుట్టు ఒత్తుగా పెరగడానికి ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Care, Care Tips, Fall, Serum, Remedy, Latest, Long, Thick-Telugu Health

ముందుగా ఒక ఉల్లిపాయ( Onion )ను తీసుకొని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు మరియు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టైనర్ సహాయంతో థిక్ జెల్లీ స్ట్రక్చర్ జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్‌ పూర్తిగా చల్లారిన తరువాత వన్ టేబుల్ స్పూన్ ఆముదం, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive Oil ) వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేస్తే మంచి హెయిర్ సీరం( Hair serum ) సిద్ధం అవుతుంది.ఈ సీరం ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Care, Care Tips, Fall, Serum, Remedy, Latest, Long, Thick-Telugu Health

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తలస్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ విధంగా చేస్తే జుట్టుకు మంచి పోషణ అందుతుంది.కుదుళ్ళు దృఢంగా మారుతాయి.హెయిర్ గ్రోత్( Hair Growth ) అనేది ఇంప్రూవ్ అవుతుంది.జుట్టు రాలడం తగ్గుతుంది.అదే సమయంలో ఎంత సన్నగా చిన్నగా ఉన్న జుట్టు అయినా సరే కొద్ది రోజుల్లోనే ఒత్తుగా పొడుగ్గా మారుతుంది.

కాబట్టి పొడవాటి జుట్టు కావాలని ఆశ పడుతున్న వారు తప్పకుండా ఈ సింపుల్ న్యాచురల్ హోమ్ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube