సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ఏ ముహూర్తాన వారి న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారో తెలియదు కానీ ఎప్పుడు ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే ఉంది.మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ మాస్ మసాలా మూవీ గుంటూరు కారం( Guntur Kaaram ).
ఈ సినిమా అనుకున్న సమయానికి పూర్తి అయ్యేలా కనిపించడం లేదు.
త్రివిక్రమ్ 2020 తర్వాత ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు.చేస్తున్న ఈ సినిమా ఇప్పట్లో పూర్తి అయ్యేలా కనిపించడం లేదు.ఈ సినిమా స్టార్ట్ కాగానే ఆపేసారు.
కేజిఎఫ్ ఫైట్ మాస్టర్లను ముందుగా తీస్కుని వారి వర్క్ నచ్చలేదని తీసేసారు.వారపు పెట్టిన ఖర్చు, ఫైట్ షూట్ మొత్తం వృధానే.
ఆ తర్వాత విలన్ ను మార్చేశారు.మళ్ళీ కొద్దీ రోజుల వరకు షూట్ చేసిన స్క్రిప్ట్ మొత్తం కాదని పక్కా ఫ్యామిలీ స్క్రిప్ట్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి.
ఇక అమరావతికి అటు ఇటు అనే టైటిల్ అనుకుని అది కూడా మార్చేసి గుంటూరు కారం అనే టైటిల్ పెట్టి కాస్త మాస్ కలర్ ఇచ్చారు.ఆ తర్వాత ఒక షెడ్యూల్ చేయగా అది కూడా వాడడం లేదని టాక్ వినిపించింది.
ఇక సమ్మర్ లో ఆగిపోయిన ఈ షూటింగ్ ఇంత వరకు స్టార్ట్ అవ్వలేదు.పలు డేట్స్ చెబుతున్నారు కానీ ఇప్పటి వరకు ప్లానింగ్ మాత్రం కనిపించడం లేదు.తాజాగా 25 నుండి అంటున్నారు కానీ అది కూడా అయ్యేలా కనిపించడం లేదు.ఇక ముందుగా ఆగస్టు 11 న రిలీజ్ అని చెప్పి మళ్ళీ వచ్చే ఏడాది 2024 సంక్రాంతికి రిలీజ్ మార్చారు.
అలాగే తాజాగా త్రివిక్రమ్ కు ఇష్టమైన పూజా హెగ్డే( Pooja Hegde ) థమన్ లను తప్పించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.మరి ఇలా అయితే మహేష్ – త్రివిక్రమ్ సినిమా కష్టమే అంటున్నారు ఫ్యాన్స్.
కాగా ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల ( SreeLeela )హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ( RadhaKrishna ) భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.
థమన్( Thaman ) సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.