నల్లటి వలయాలను మాయం చేసే బెస్ట్ ఐ మాస్క్ మీకోసం!

నల్లటి వలయాలు( Dark circles ).మనలో ఎంతో మందిని కలవర పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.

 The Best Eye Mask To Get Rid Of Dark Circles Is For You! Dark Circles, Dark Circ-TeluguStop.com

ముఖ్యంగా అమ్మాయిలు నల్లటి వలయాల వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు.వాటిని వదిలించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే ఐ మాస్క్ మీకు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ ఐ మాస్క్ ను రెగ్యులర్ గా వేసుకుంటే వారం రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు.మరి లేటెందుకు ఆ ఐ మాస్క్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Tips, Dark Circles, Darkcircles, Eye, Remedy, Latest, Skin Care, Skin Car

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టమాటో స్లైసెస్, రెండు పీల్‌ తొలగించిన బంగాళదుంప ముక్కలు, రెండు కీర దోసకాయ స్లైసెస్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder) వేసుకోవాలి.అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు టమాటో కీరా బంగాళదుంప జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Dark Circles, Darkcircles, Eye, Remedy, Latest, Skin Care, Skin Car

ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్ సహాయంతో కళ్ళ చుట్టూ మాస్క్ లా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత తడి క్లాత్ సహాయంతో ఐ మాస్క్ ను తొలగించాలి.ఆపై రెండు లేదా మూడు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ తీసుకొని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ విధంగా చేశారంటే కళ్ళ చుట్టూ నలుపు మొత్తం మాయమవుతుంది.

డార్క్ సర్కిల్స్ పరార్ అవుతాయి.కళ్ళ వద్ద ఏమైనా ముడతలు ఉన్న త‌గ్గు ముఖం పడతాయి.

కాబట్టి డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్న వారు, వాటిని వదిలించుకోవాలని తాపత్రయ పడుతున్నవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న బెస్ట్ ఐ మాస్క్ ను ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube