ప్రస్తుత రోజుల్లో హెయిర్ ఫాల్ ( Hair fall )అనేది దాదాపు అందర్నీ చాలా కామన్ గా వేధిస్తుంది.ఆహారపు అలవాటు, పోషకాల కొరత, చెడు వ్యసనాలు, రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, అధిక ఒత్తిడి తదితర అంశాలు జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే జట్టు రాలడం, విరగడం, చిట్లడం వంటి సమస్యలు తలెత్తుతాయి.అయితే ఈ సమస్యలను నివారించే ఔషధాలు మన వంటింట్లోనే ఎన్నో ఉన్నాయి.
కరివేపాకు మరియు అల్లం కూడా ఆ కోవకే చెందుతాయి.ఈ రెండు జుట్టుకు దివ్యౌషధాలు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
కరివేపాకు, అల్లం( Curry leaves, ginger ).ఈ రెండిటినీ ఉపయోగించి అనేక జుట్టు సమస్యలను దూరం చేసుకోవచ్చు.ముఖ్యంగా జుట్టు రాలే సమస్యకు ఈ రెండిటితో చెక్ పెట్టవచ్చు.

అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు( Ginger slices ) వేసి కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు అల్లం మిశ్రమం వేసి దాదాపు 15 నిమిషాల పాటు మరిగిస్తే మంచి హెయిర్ టానిక్ రెడీ అవుతుంది.

స్టవ్ ఆఫ్ చేసుకుని తయారు చేసుకున్న టానిక్ ను ఫిల్టర్ చేసి చల్లారబెట్టుకోవాలి.గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక స్ప్రే బాటిల్ లో టానిక్ ను నింపుకొని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు స్పార్లు స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకోవాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ విధంగా చేశారంటే జుట్టు రాలయం క్రమంగా దూరమవుతుంది.హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారుతాయి.చుండ్రు సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
జుట్టు ఆరోగ్యంగా బలంగా మారుతుంది.దట్టంగా సైతం ఎదుగుతుంది.







