ఒకప్పుడు సినిమాలు సూపర్ హిట్ అంటే 50 రోజులు పూర్తి చేసుకున్నవి లేదా వంద రోజులు బాగా ఆడాయా అని చూసే వారు.కానీ నేటి రోజుల్లో మాత్రం పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యాయి అంటే చాలు ఇక ఆ సినిమా ఎన్ని కోట్లు వసూళ్లు రాబట్టింది.
సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎంత.వీకెండ్ పూర్తయ్యే సరికి కలెక్షన్స్ ఎంత వచ్చాయి.
ఇక పూర్తిగా సినిమా రన్ టైం పూర్తయ్యేసరికి ఎన్ని వందల కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.నిర్మాతలకు ఎంత లాభం వచ్చింది అన్నది చూస్తూ ఉన్నారు.
ఇలా ఇటీవలి కాలంలో ఒక సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా 50 రోజులు కూడా పూర్తికాకముందే ఓటిటీలో దర్శనమిస్తుంది అన్న విషయం తెలిసిందే.
అయితే ప్రతీ హీరో సినిమా విడుదలైనప్పుడు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో కలెక్షన్స్ పై అందరి దృష్టి ఉంటుంది.
ఎందుకంటే ఎప్పటినుంచో అదొక సెంటిమెంట్.అక్కడ బాగా కలెక్షన్స్ వచ్చాయంటే సినిమా సూపర్ హిట్ అని నమ్ముతూ ఉంటారు.
అందుకే మొదటి రోజు ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది అని చూస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్టు తెలుసుకుందాం.
1.పుష్ప డే 1 గ్రాస్: అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒకే రోజులో రూ.41, 31,445 కలెక్షన్స్ రాబట్టింది.
2.భీమ్లా నాయక్ డే 1 గ్రాస్: పవన్ కళ్యాణ్ నాన్న కాంబినేషన్ లో తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రూ.38,06,660 వసూళ్లు రాబట్టింది.
3.సరిలేరు నీకెవ్వరు డే 1 గ్రాస్ : మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మొదటిరోజు రూ.37,27,029 కలెక్షన్లు రాబట్టింది.
4.బాహుబలి 2 డే 1 గ్రాస్ : భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన బాహుబలి 2 సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మొదటిరోజు రూ.36,09,236 కలెక్షన్స్ దక్కించుకుంది.
5.రాధే శ్యామ్ డే 1 గ్రాస్ : ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన హిస్టోరికల్ లవ్ స్టోరీ సినిమా రాధ శ్యామ్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో రూ.35,08,380కలెక్షన్స్ రాబట్టింది.
6.వకీల్ సాబ్ డే 1 గ్రాస్ : పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రూ.34,40,073 వసూళ్లను రాబట్ట కలిగింది?
7.సాహో డే 1 గ్రాస్ : బాహుబలి సినిమా తర్వాత భారీ అంచనాల మధ్య ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా సాహూ ఇక ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్డు మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే.రూ.34,29,293 కావడం గమనార్హం.
8.మహర్షి డే 1 గ్రాస్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమా మంచి హిట్ అయ్యింది.ఇక ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే రూ.29,98,581 రాబట్టగలిగింది.
9.అజ్ఞాతవాసి : పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అజ్ఞాతవాసి.ఈ సినిమా ఫ్లాప్ అయింది.
కానీ మొదటి రోజు ఆర్టీసీ క్రాస్రోడ్స్లో మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టింది.మొదటి రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రూ.28,96,772 వసూళ్లు రాబట్టింది.
10.సైరా డే 1 గ్రాస్ : స్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ సైరా నర్సింహారెడ్డి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రూ.25,40,271 కలెక్షన్స్ రాబట్టగలిగింది.