తండాలో తరుచూ అగ్ని ప్రమాదాలు...మంత్రాలని గిరిజనుల భయాందోళన

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ మండలం( Miryalaguda Mandal) కురియాతండాలో గత కొన్ని నెలలుగా నిత్యం అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ గడ్డి వాములు,గుడిసెలు దగ్ధమవుతున్న నేపథ్యంలో గ్రామస్తులు ఇదేదో మంత్రతంత్రాలని భయందోళనకు గురి అవుతున్నారన్న విషయం తెలుసుకున్న జానవిజ్ఞాన వేదిక ప్రజా పౌర సంఘాల ప్రతినిధులు డాక్టర్ రాజు,కోలా శ్రీనివాస్,కస్తూరి ప్రభాకర్ తండాకు చేరుకొని,అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో నెలకొన్న మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు ప్రజలతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని,మంత్ర తంత్రాలను నమ్మి ఆర్థికంగా,మానసికంగా నష్టపోవద్దని,తగునివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

 Frequent Fire Accidents In Tanda...tribals Are Afraid Of Spells-TeluguStop.com

మూఢనమ్మకాల నిర్ములనకై అవగాహనా కార్యక్రమాలు చేస్తామన్నారు.అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ ధనవత్ సూర్య,మాజీ ఉప సర్పంచ్ ధనవత్ థావు మాట్లడుతూ మధ్యాహ్న సమయంలో నంద్యా,సోమ్లా, విజేందర్ లకు సంబంధించిన 500 గడ్డి కట్టలు కాలిపోయాయని,ఆ కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు,మహిళలు గ్రామం పెద్దలు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube