శ్రీకాంతాచారి జయంతి వేడుకలు

నల్లగొండ జిల్లా: మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 37వ జయంతి వేడుకలు మంగళవారం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ లో విశ్వబ్రాహ్మణ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ హాజరై శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 Telangana Martyr Srikanthachari Birth Anniversary Celebrations At Nalgonda, Tela-TeluguStop.com

అనంతరం కెట్ కట్ చేసి స్వీట్స్ పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాసోజు శ్రీకాంతచారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు.

ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాలలో,మండలాల్లో గ్రామాల్లో ఘనంగా జరిపించడం కోసం విశ్వబ్రాహ్మణ యువజన సంఘం చేస్తున్న కృషిని అభినందించారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు పర్వతం అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు కాసోజు శంకరాచారి, గడుగోజు వినయ్, చిన్నోజు రాజు, గుంటోజు బ్రహ్మచారి, కూరెల్ల రమణయ్య, లక్ష్మణ్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube