నాంపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

నల్లగొండ జిల్లా: నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని బీజేవైఎం మండల అధ్యక్షుడు నాంపల్లి సతీష్ ఆధ్వర్యంలో తాహసిల్దార్ ఆఫీస్ లో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాంపల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.

 A Government Degree College Should Be Established At Nampally, Government Degre-TeluguStop.com

గిరిజన గ్రామాలకు సంబంధించి బడుగు బలహీనవర్గాల నిరుపేద విద్యార్థులు అధికంగా ఉన్న మండలంలో పై చదువుల కొరకు దూర ప్రాంతాలకు వెళ్లలేక అర్దిక ఇబ్బందులు ఎదురై చదువుకు దూరం అవుతున్న విషయాన్ని ప్రభుత్వం ఇకనైనా గుర్తించాలన్నారు.మూడు జూనియర్ కళాశాలలు ఉన్న నాంపల్లిలో ప్రతి సంవత్సరం 500 నుండి 700 వరకు విద్యార్థులు ఇంటర్ విద్య పూర్తి చేసి పై చదువుల నిమిత్తం

హైదరాబాదు,దేవరకొండ, మాల్,నల్లగొండ లాంటి ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక ఎంతోమంది విద్యార్థులు కూలీలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని,మరి అమ్మాయిలు అయితే చిన్న వయసులో పెళ్లి చేసి పంపే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

నాంపల్లి మర్రిగూడ,గుర్రంపోడ్, చింతపల్లి మండలాలకు గాను నాంపల్లి మండల కేంద్రంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థుల భవిష్యత్తుకు తొడ్పాడాలని ప్రభుత్వాన్ని కోరారు.లేనియెడల రానున్న రోజులలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చెప్పడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు దాచేపల్లి నర్సింహా, చిరుమామిళ్ల గిరిబాబు, పోలగోని శ్రీకాంత్, కార్యదర్శి వల్లపు కోటేష్, ప్రధాన కార్యదర్శిలు మేకల శ్రీకాంత్,మరుపాకల శివ గౌడ్,కోరే సైదులు,కొట్ర శ్రీకాంత్,కర్నాటి సాంబాశివ,నాంపల్లి శంకర్,సీతారాం,ధరమ్ సింగ్,వేముల స్వామి, గుండమళ్ళ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube