నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం సంగారం గ్రామంలో నకిలీ ధరణి పాస్ బుక్కులు తయారు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సి.నారాయణరెడ్డికి సోమవారం బాధితులు వినతిపత్రం అందజేశారు.
అనంతరం బాధితుడు ఊరే రామచంద్రయ్య మాట్లాడుతూ సంగారం గ్రామంలో సర్వేనెంబర్ 133/4 లో 9 ఎకరాల 20 గుంటల వ్యవసాయ భూమి తనకున్నదని, అందులో 7 ఎకరాలు ఇతరులకు విక్రయించడం జరిగిందన్నారు.పక్కన ఉన్న భూ యజమాని తన దగ్గర ఎకరం 20 గుంటలు కొనుగోలు చేశారని,తన పాసు బుక్కులో ఎకరం 20గుంటలకు బదులుగా మూడు ఎకరాల 20 గుంటలుగా చూయిస్తున్నాడని,
ఆ భూమి అసలు యజమాని అయిన తన పేరున ఆన్లైన్లో ధరణిలో చూయిస్తుందన్నారు.
అతను నకిలీ పాసుబుక్ లు ముద్రించుకొని భూమి నాదని చెబుతున్నారని, ఈ విషయంపై స్థానిక ఎమ్మార్వో పరిశీలించి అతనిది నకిలీ పాస్ పుస్తకమని,అతని మీద కేసు ఫైల్ చేయండని స్థానిక ఎస్సై, సీఐ లెటర్ ద్వారా పంపించారని,కానీ, సంబంధిత ఎస్సై,సీఐ కాలయాపన చేస్తున్నారని,పైగా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొండని ఉచిత సలహా ఇస్తున్నారని వాపోయారు.ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ను ఆశ్రయించామని తెలిపారు
.