సూర్యాపేట జిల్లా:మిషన్ భగీరథ లోపాలను సరిదిద్ది సూర్యాపేట పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కారించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ధర్మార్జున్ అన్నారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పట్టణంలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ జనశమితి పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ మరియు మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపంతో మిషన్ భగీరథలో తలెత్తుతున్న వివిధ సాంకేతిక లోపాలతో సూర్యాపేట ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని,రెండు లేదా మూడు రోజులకు ఒక్కసారి పట్టణంలో మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయుట వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు.
పట్టణానికి నీటిని ఇమామ్ పేట పంఫింగ్ స్టెషన్ నుండీ రోజుకు 21ఎం.
ఎల్.డి లీటర్ల నీటిని సరఫరా చేయవలసి ఉండగా కేవలo 16-17 ఎం.ఎల్.డిల నీటిని సరఫరా చేస్తున్నారన్నారు.దీనివల్ల పట్టణంలో నీటి సరఫరా సజావుగా జరగడం లేదని,పట్టణానికి మిషన్ భగీరథ వాటర్ పంపింగుకు ప్రత్యామ్నాయ విధానం లేనందున సాగర్ కెనాల్ అడవిదేవులపల్లి,చిట్యాల నుండి వచ్చే వాటర్ పంపింగ్ లో మోటార్లు మరమ్మతులైనా లేక విద్యుత్ సౌకర్యం ఆగిపోయినా,లీకేజీల వల్ల నీటి సరఫరా ఆగిపోతుందని తెలిపారు.మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకున్న జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభాను అంచనాలోకి తీసుకొని ఆదే ప్రాతిపదికన నేటికి పంపింగ్ చేస్తున్నారని, ప్రస్తుతం సూర్యాపేట పట్టణ అంచనా జనాభా 1 లక్ష 80 వేల పైన దాటిందని,
ఈ అంచనాను మిషన్ భగీరథ వారు 2033 సంవత్సరానికి చూయించారని,ఫలితంగా పట్టణంలో నిటి కొరత ఏర్పడుతుందన్నారు.
ఒక వైపు గాండ్లచెర్వు నుండి కూడా నీటిని పంపింగ్ చేస్తూనే మరోవైపు ఇమాంపేట వద్దనే ఉన్న 3 వ మోటర్ నూ వెంటనే వినియోగంలోకి తెచ్చి పట్టణ ప్రజలకు ప్రతి రోజూ మిషన్ భగిరధ నీటిని అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు గట్ల రమాశంకర్,ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బచ్చలకూరి గోపి, డిఎల్సిఎల్ జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు కొంచెం చంద్రకాంత్,అనిల్,విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్,పట్టణ మైనార్టీ సెల్ కన్వీనర్ ఫరీదొద్దీన్,పట్టణ నాయకులు సతీష్ కిషోర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.