సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో ఇళ్లలో వాడుకునే నీటిని మెయిన్ రోడ్డుపైకి వదలడంతో 365 రోజులు బురదే ఉంటుందని, ఇదేంటని అడిగేవాళ్లు లేక ప్రజలు నిత్యం ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ఏ బజారులో చుసినా ఇదే పరిస్థితి నెలకొందని, ప్రభుత్వ పాఠశాల చుట్టూ మురికి నీరు చేరి కంపు కొడుతుందని,పాఠశాలకు రావాలంటే పిల్లలు ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు.
ఇలా రోడ్లపై నీళ్లు వదలడంతో మురుగు గుంతలు ఏర్పడి దోమలు స్వైర విహారం చేస్తూ ప్రజలు విషజ్వరాల భారిన పడుతున్నారని, గ్రామ కార్యదర్శి,ప్రత్యేక అధికారి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు.ఇంట్లో వాడుకున్న నీటిని నిల్వ చేయుటకు మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా ఇంకుడు గుంత కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రూ.4200 ఆర్ధిక సాయం అందిస్తున్నా ఎందుకు కటించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.చెప్పే వాళ్ళు లేరా లేక చెప్పినా మా ఇష్టం అంటున్నారా అర్దం కావడం లేదంటున్నారు.
అధికారులు తక్షణమే స్పందించి రోడ్లపైకి నీళ్లు రాకుండా చూడాలని,విషజ్వరాల నుండి ప్రజలను కాపాడాలని కోరుతున్నారు.