సూర్యాపేట జిల్లా: సామాజిక,ఆధ్యాత్మిక విప్లవకారుడు మహాత్మా బసవేశ్వర స్వామి 890 వ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బసవేశ్వర స్వామి సమాజంలో కుల వ్వవస్థను,వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది అన్నారు,లింగాయత ధర్మం స్థాపించారని,చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అవగతం చేసుకొని,రాజ్యపాలనలో ప్రధాన భూమిక నిర్వహిస్తూ వచన సాహిత్యంతో ప్రజలందరినీ కులమతాలకతీతంగా ఏకం చేశారని, బోధనలలోని సమదృష్టితో ఎందరినో ఆకర్షించి, వీరశైవ మతానికి పట్టం కట్టిన బసవేశ్వర స్వామి ఖ్యాతి కర్ణాటక ఎల్లలు దాటి తెలుగు రాష్ట్రాలలో వ్యాప్తి చెందడం జరిగిందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో డిఎస్పీలు నాగభూషణం,వెంకటేశ్వర రెడ్డి,డిసిఆర్బీ డిఎస్పీ రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డిసిఆర్బీ ఇన్స్పెక్టర్ నర్సింహ,పట్టణ సీఐ రాజశేఖర్,సీసీఎస్ సిఐ గౌరీ నాయుడు, ఆర్ఐలుశ్రీనివాస్,గోవిందరావు,ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.