కమెడియన్ లకు సినిమా అవకాశాలు లేకపోయినా సరే టెలివిజన్ ఇండస్ట్రీ ఉండనే ఉంది.ఏదో ఒక రియాలిటీ షోలో వెళ్లి నాలుగు కామెడీ పంచులు వేస్తే చాలు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేయచ్చు.
అలా ఇటీవల కాలంలో అక్కడక్కడ కనిపిస్తున్నారు నిన్నటి తరం హాస్య నటుడు కృష్ణ భగవాన్..
జబర్దస్త్ వంటి కామెడీ షో లో అప్పుడప్పుడు స్కిట్ లో పాటిస్పేట్ చేసిన భగవాన్ ఇప్పుడు ఏకంగా నాగబాబు కూర్చున్న జడ్జి స్థానంలో కూర్చున్నాడు.రోజా స్థానంలో ఇంద్రజ అలాగే నాగబాబు స్థానంలో కృష్ణ భగవాన్ ఈ జంట ప్రస్తుతం జబర్దస్త్ కి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ వరుసగా జడ్జిలను మారుస్తూ జబర్దస్త్ నీకు కంపు పుట్టించారు మల్లెమల.ఇక కమెడియన్ అయితే సరే సరి.ఎవరు ఉంటున్నారు, ఎవరు వెళ్తున్నారో ? ఎప్పుడు వెళ్తారు ?ఎప్పుడు వస్తారో ? క్లారిటీ లేనేలేదు.ఇప్పటివరకు ఈ ప్రోగ్రాం కి ఎంతోమంది జడ్జిలు కూడా మారారు అయితే కృష్ణ భగవాన్ మంచి కామెడీ టైమింగ్ ఉన్న హాస్యనటుడు.
అలాగే రచయితగా కూడా పనిచేశాడు, కథానాయకుడుగా మారి సినిమాలు కూడా చేశాడు.అయితే ఇటీవల తన ఆరోగ్యం బాగా లేకపోవడంతో సినిమాలకు దూరమైనట్టుగా అనేక రూమర్స్ వచ్చాయి.

అయితే తనకు ఆరోగ్య సమస్యలు ఏమీ లేవని క్యాన్సర్ లాంటి రోగాలు అస్సలు రాలేదని క్లారిటీ ఇచ్చాడు కృష్ణ భగవాన్.అంతేకాదు తనదైన రీతిలో అందరి మీద పంచులు వేసి నవ్వులు పోయించాడు.మరి ఇలాంటి ఒక కామెడీ టైమింగ్ ఉన్న నటుడిని జబర్దస్త్ ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పటికైనా ఒకరిని ఫిక్స్ చేస్తే బాగుంటుంది అని మాత్రం అందరూ కోరుకుంటున్నారు.అయితే కృష్ణ భగవాన్ కి ఉన్న అతిపెద్ద దురాలవాటు మద్యం.
ఆ మధ్య కాలంలో తాగేసి ఓ కాలేజ్ ఫంక్షన్ కి వెళ్లి రచ్చ చేసిన కృష్ణ భగవాన్ మళ్లీ అలాంటి సాహసం ఇప్పటివరకు చేయలేదు మరి జబర్దస్త్ లో ఎలా కొనసాగుతాడో వేచి చూడాలి.