కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం

సూర్యాపేట జిల్లా:విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం( Central Govt ) చెలగాటం ఆడటం సరైనది కాదని,నీట్ పరీక్ష పత్రం లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, పి.డి.

 The Central Government Is Interfering With Students' Lives , Central Government,-TeluguStop.com

ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలెబోయిన కిరణ్,విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్ డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టబడి,వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ(BJP ) పాలిత రాష్ట్రాలు బీహార్,హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో నీట్ పేపర్లు లీకైనా మోడీ నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు.ముమ్మాటికి పేపర్ లీకేజీల వ్యవహారం వెనకాల బీజేపీ హస్తముందన్నారు.

వైద్య వృత్తిపై ఎంతో ఆశతో లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకొని చదువుకున్న విద్యార్థులకు నిరాశ మిగిలిందన్నారు.పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని,బాధిత విద్యార్థులకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్రం నిర్వహించే ప్రతి పరీక్ష అవకతవకలు మరియు లీకేజీలు జరుగుతున్నాయని, రాష్ట్రాల వారీగా గతంలో మాదిరిగా పరీక్షలు నిర్వహించాలని కోరారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో పి.వై.ఎల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు నల్లగొండ నాగయ్య,దరావత్ రవి,ముస్లిం మైనారిటీ జిల్లా నాయకులు షేక్ జహంగీర్,ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు తాళ్ల వినయ్, పి.డి.ఎస్.యు డివిజన్ కార్యదర్శి పిడమర్తి భరత్, సాయి దీపక్,అభినయ తేజ, వరుణ్,లోకేష్,శివ,బన్నీ, ఉపేందర్,సంతోష్,నవీన్, జగదీష్,సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube