సూర్యాపేటలోని కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేశ్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.పటేల్ రమేశ్ రెడ్డితో చర్చలు జరిపేందుకు హస్తం నేతలు వెళ్లారు.
ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మల్లు రవి కలిసి పటేల్ రమేశ్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.ఇండింపెండెంట్ అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్ ను ఉపసంహరించుకుని కాంగ్రెస్ కు మద్ధతు ఇవ్వాలని పార్టీ నేతలు కోరుతున్నారు.
అయితే సూర్యాపేట టికెట్ ఆశించి పటేల్ రమేశ్ రెడ్డి భంగపడిన విషయం తెలిసిందే.మరోవైపు కాంగ్రెస్ నేతలు వెనుదిరిగి వెళ్లాలని డిమాండ్ చేస్తూ రమేశ్ రెడ్డి వర్గీయులు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.