సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం అప్పన్నపేట శివారులో శుక్రవారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.మృతుడు మోతె మండలం కరక్కాయలగూడెం గ్రామానికి చెందిన దుషర్ల రాము(35)గా కుటుంబ సభ్యులు గుర్తించారు.
మృతుడు నెరేడుచర్ల మండలం దిర్శించర్లలో బంధువుల వివాహానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది.







