రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

సూర్యాపేట జిల్లా:మునగాల మండల కేంద్రంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోదాడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చందా వెంకట అప్పారావు తీవ్రంగా గాయపడి,హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.మృతుడు పదోతరగతి పరీక్షల ఇన్విటేషన్ డ్యూటీలో భాగంగా మునగాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నాడు.

 Teacher Killed In Road Accident-TeluguStop.com

పరీక్ష విధులు ముగించుకొని తన మోటార్ సైకిల్ పై మరో ఉపాధ్యాయుడితో కలిసి కోదాడకు వెళ్తుండగా మునగాల ఫ్లైఓవర్ దగ్గర ఎదురుగా రాంగ్ రూట్ లో వస్తున్న గుర్తు తెలియని బైక్ ఢీ కొనడంతో చందా వెంకట అప్పారావు తలకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్ళగా చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృత్యువాత పడ్డాడు.మృతుడికి భార్య,ఒక పాప ఉన్నట్లు సమాచారం.

ఎదురుగా రాంగ్ రూట్ లో అతి వేగంగా వస్తున్న వాహనదారుడి అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు మృతుడి భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్ఐ బాలు నాయక్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube