సూర్యాపేట జిల్లా:కోదాడ ఎమ్మెల్యేపై నిరాధారమైన వార్తలు రాస్తావా అంటూ ఎమ్మెల్యే అనుచరుడు కోదాడ ఐ న్యూస్ రిపోర్టర్ కు కాల్ చేసి బెదిరింపులకు దిగిన ఆడియా జిల్లాలో వైరల్ గా మారింది.ఎమ్మెల్యేపై వ్యతిరేక వార్తలు రాస్తే అంతుచూస్తామని,బయట తిరిగేప్పుడు జర జాగ్రత్తగా ఉండాలంటూ ఐన్యూస్ ప్రతినిధిని హెచ్చరించడం గమనార్హం.
జర్నలిస్టులు వృత్తిలో భాగంగా వార్తలు రాసినప్పుడు అందులో అభ్యంతరకరమైన అంశాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ,ఇలా బెదిరింపు చర్యలకు పాల్పడడం,భయబ్రాంతులకు గురి చేయడం ఏమిటని జర్నలిస్ట్ నాయకులు ప్రశ్నిస్తున్నారు.బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు.