శివుడు స్వయంభువుగా వెలిసిన కేదార్ నాథ్ క్షేత్రం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

పరమేశ్వరుని సన్నిదానాల్లో పరమ పవిత్రమైనది కేదార్నాథ్ మహా క్షేత్రం. హిమ గిరుల్లో నెలకొన్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా యుగ యుగాలుగా వేలాది మంది భక్తులు పూజలు అందుకుంటోంది.

 Do You Know Thiese Things Of Kedar Nath Temple Details, Kedarnath Temple ,pandav-TeluguStop.com

రుద్ర హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే భక్తులు చాలా శ్రమించాల్సి వుంటుంది.ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్ర ప్రయాగ్ జిల్లాలోని పర్వతాల్లో పరమ శివుడు కేదారేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇస్తాడు.

శీతా కాలంలో ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు.వేసవి కాలం.

ప్రారంభంలోనే ఆలయాన్ని తెరవడం సంప్రదాయంగా వస్తోంది.మందాకిని నది జన్మ స్థానం కూడా కేదార్నాథ్ సమీప పర్వతాల్లోనే వుంది.

స్వయంభువుగా శివుడు.పరమ శివుడు ఇక్కడ స్వయంభువుగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంటారు.ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులు విజేతలుగా నిలుస్తారు.అయితే యుద్ధంలో తమ సొంత దాయాదులను చంపవలసి వచ్చినందుకు ఎంతగానో వేదనకు గురవుతారు.

తమ పాపాల నుంచి విముక్తి పొందేందుకు మహేశ్వరుని దర్శనం కోసం హిమాలయాలకు చేరుకుంటారు.

Telugu Devotional, Maha Shiva, Pandava, Parameswara, Telugu Bhakthi-Latest News

ఈశ్వరుడు వృషభ రూపంలో కేదారం వద్ద వుండటాన్ని పాండవులు గమనిస్తారు.వారు వచ్చేలోగా శివుడు భూమిలోకి వెళ్లిపోతాడు.పాండవులకు మోపురం మాత్రమే దర్శనం ఇస్తుంది.

ఆ దర్శనంలో పాండవులకు పాప విముక్తి కలుగుతుంది.భూమిలోకి వెళ్లిన పరమేశ్వరుని ముఖ భాగం నేపాల్లోని పశుపతి నాథ ఆలయంలో వున్నట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.

మధ్య మహేశ్వర్, తుంగౌద్, రుద్రసాద్, కల్పేశ్వర్, కేదార్నాథ్… ఈ ఐదింటిని పంచ కేదార్నాథ్ క్షేత్రాలుగా పేర్కొంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube