ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.09
సూర్యాస్తమయం: సాయంత్రం 06.03
రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు
అమృత ఘడియలు:మంచి రోజు కాదు వరకు
దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05మ3.21 సా4.12 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
వృషభం:
ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.
మిథునం:
ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు పంపుతారు.
కర్కాటకం:
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
సింహం:
ఈరోజు మీకు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.ఎప్పటినుండో ఉన్న కోర్ట్ సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.మీ తండ్రి ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.
కన్య:
ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
తులా:
ఈరోజు మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంత మంచె జరుగుతుంది.
వృశ్చికం:
ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి వారితో చర్చలు చేస్తారు.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఈరోజు మీరు పూర్తి చేస్తారు.
ధనస్సు:
ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.
మకరం:
ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు.కొన్ని పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
కుంభం:
ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీరు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అది మీ మనసులో ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.వ్యవసాయదారులు ఈరోజు అధిక లాభాలు అందుకుంటారు.మీరు చేసే పనిలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.
DEVOTIONAL