ఇక తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర రద్దీ పెరగనుంది.ఎందుకంటే ఈ నెల 22 నుంచి 28 వరకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
అయితే శ్రీవారి ఆలయంలో ఆన్లైన్ ఆర్జిత వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లతో పాటు వాటికి సంబంధించిన పలు దర్శన కోటాను ఫిబ్రవరి 9న ఉదయం పదిగంటల నుండి ఆన్లైన్లో టీటీడీ అందుబాటులో ఉంచనుంది.
అలాగే లక్కీడిప్ లో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల నమోదు కోసం ఫిబ్రవరి 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు అవకాశం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
ఆర్జిత సేవ టికెట్లను ఈనెల 8వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్లైన్లో బుకింగ్ అందుబాటులో ఉండనుంది.ఇక ఈ విషయం భక్తులు గ్రహించి వెంటనే టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
ఇక తిరుమలలో రద్దీ విషయానికొస్తే సాధారణంగానే తిరుమల లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.ఇక భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్మెంట్లలోనే శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.అయితే ఈ దర్శనం కోసం ఐదు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.ఇక సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులు క్యూ లైన్ లో ప్రవేశిస్తే దర్శనానికి మరింత సమయం పడవచ్చని అధికారులు తెలిపారు.
ప్రత్యేక దర్శనం టికెట్లు 300 రూపాయలకు కొనుగోలు చేసిన వారికి స్వామివారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.శ్రీవారిని 65,297 మంది భక్తులు దర్శించుకున్నారు.వీరిలో 23,975 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకొని తమ మొక్కులను తీర్చుకున్నారు.ఇక నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం విషయానికొస్తే 3.87 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
DEVOTIONAL