జ్యోతిష్య శాస్త్రంలో పుష్య పౌర్ణమి( Pushya paurnami: )కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది.అయితే పుష్య పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు.
అయితే ఈరోజు పుష్య పౌర్ణమి సందర్భంగా అరుదైన అద్భుతమైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి.ఈ సంవత్సరంలో పుష్య వాసంలోని శుక్లపక్ష పౌర్ణమి రోజున పుష్య పౌర్ణమిగా చెబుతారు.
పౌర్ణమి తిధి జనవరి 24 బుధవారం రోజు రాత్రి 9:49 నిమిషాలకు ప్రారంభమై జనవరి 25 గురువారంనాడు రాత్రి 11:23 నిమిషాల వరకు ఉంటుంది.సాధారణంగా ఉదయం ఉన్న తిధి ప్రకారం పరిగణల్లోకి తీసుకోవడంతో సంవత్సరంలోని మొదటి పుష్య పూర్ణిమను జనవరి 25వ తేదీని నిర్వహిస్తున్నారు.
పుష్య పౌర్ణమి రోజు ఉపవాసం, దానాలు, స్నానాలు చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి.
ఇక ఈ సంవత్సరం పుష్యమి పౌర్ణమి నాడు సర్వార్ధ స్థితియోగం, ప్రీతియోగం, గురుపుష్య యోగం, అమృత సిద్ది యోగం, రవి యోగం కలయిక జరగబోతుంది.అంతేకాకుండా త్రిగ్రహీ యోగంతో పౌర్ణమి ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది.ఈ రోజున పూజా విధానం ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి.
పుష్య పౌర్ణమి నడు లక్ష్మీనారాయణ( Lakshmi Narayan )ను ప్రతి ఒక్కరూ పూర్ణ కృతువులతో పూజించాలి.ఈరోజు విష్ణుమూర్తికి పసుపు రంగు పళ్ళు, పువ్వులు, వస్త్రాలు సమర్పించాలి.
అలాగే లక్ష్మీదేవి( Goddess Lakshmi )కి గులాబీ లేదా ఎరుపు రంగు పువ్వులు, అలంకరణ వస్తువులను సమర్పించాలి.ఇక సత్యనారాయణ స్వామిని పూజించి, సత్యనారాయణ స్వామి వ్రత కథలు చదివితే పుణ్యం లభిస్తుంది.
పుష్య పూర్ణమి నాడు బ్రహ్మ ముహూర్తం( Brahma Muhurta )లో స్నానం చేయడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి.అలా నది స్నానం చేయలేకపోతే కనీసం స్నానం చేసే నీటిలో అయినా గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేస్తే ఫలితం ఉంటుంది.అలాగే ఉపవాసం ఉండడం వలన లక్ష్మీనారాయణను పూజించడం ద్వారా ఇంట్లో సంతోషం, సంపద, శ్రేయస్సు లభిస్తాయి.ఇక పుష్య పౌర్ణమినాడు శుభముహూర్తం విషయానికి వస్తే బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:09 నుండి 6:02 వరకు ఉంటుంది.ఇక అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుండి 12:40 వరకు ఉంటుంది.విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:07 నుండి 2: 50 వరకు ఉంటుంది.ఇక అమృతకాలం 3: 29 నుండి 5:14 నిమిషాల వరకు ఉంటుంది.
LATEST NEWS - TELUGU