శబరిమల 18 మెట్లు ఎవరు కట్టించారు, అవి ఒకొక్కటి దేనికి ప్రతీకో తెలుసా?

నవంబర్‌, డిసెంబర్‌, జనవరి ఈ మూడు నెలలు కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్‌ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అయ్యప్ప భక్తులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప భక్తులు లక్షల్లో ఉంటారు.

 Significance Of 18 Steps In Kerala Shabarimala Ayyappa Swamy Sannidhanam-TeluguStop.com

ఈ మూడు నెలలు కూడా పూజలు, అన్న దానాలు, భక్తి గీతాలు గల్లీ గల్లీకి కనిపిస్తూ ఉంటాయి.అయ్యప్ప స్వామికి ఈ మూడు నెలలు ఎక్కువగా మాలలు ధరించి ఇరుముడి కట్టి కేరళలో ఉన్న శబరి గిరీశుడిని దర్శించుకుంటారు.

Telugu Shabhariayyapa, Telugu-General-Telugu

శబరి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకునేందుకు కొండ మార్గంలో దాదాపు 5 వేల అడుగుల ఎత్తులో ఉన్న కొండను ఎక్కాల్సి ఉంటుంది.అంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్న కొండను ఎక్కిన తర్వాత అయ్యప్ప గుడి ముందు ఉండే బంగారు మెట్లు ఎక్కి ఆ బంగారు మెట్లను మొక్కుతూ అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ ఉంటారు.అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు అంతటి అదృష్టం అందరికి కలుగదు.మండల కాలం దీక్ష చేసిన వారు అయ్యప్ప స్వామి వారి బంగారు మెట్లు ఎక్కి ఆయన్ను దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని అంటూ ఉంటారు.

Telugu Shabhariayyapa, Telugu-General-Telugu

అయ్యప్ప సన్నిదానంలో ఉండే 18 మెట్లకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.మెట్టు మెట్టుకు ఉండే ప్రాముఖ్యత వల్ల మనలో ఉండే చెడు గుణాలు అన్ని కూడా నాశనం అవుతాయి.18 మెట్లు ఎక్కిన వారి జీవిత దన్యం అవుతుంది.ఈ 18 మెట్లను పరశురాముడు కట్టించాడు.ఆయన పంచ భూతాలను మరియు మనిషి వేటి వల్ల ఇబ్బంది పడుతున్నాడో వాటిని మెట్లుగా మలిచి నిర్మించాడంటూ చెబుతూ ఉంటారు.18 మెట్లు జీవితంలో ఒక్కసారి ఎక్కినా కూడా జీవితాంతం ఫలం దక్కుతుందట.

18 మెట్లలో మొదటి ఎనిమిది మెట్లు అష్ట దిక్పాలకులు అంటే ఇంద్రుడు, అగ్ని, యముడు, నైరూతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు.9 మరియు 10 మెట్లు రెండు యోగములు.అవి కర్మ యోగం మరియు జ్ఞాన యోగం.మిగిలినవి విద్య, అవిధ్య, జ్ఞానం మరియు అజ్ఞానం, ఆనందం, ధుఖం, మనశాంతి, మోక్షం.ఇలా 18 మెట్లు దాటుకుంటూ వెళ్లడంతో జీవితం ఆనందమయం అవుతుంది.

Telugu Shabhariayyapa, Telugu-General-Telugu

18 మెట్లను నెయ్యి ఉన్న కొబ్బరికాయలు నెత్తిన పెట్టుకుని, ఆ నెయ్యిని అయ్యప్పకు అభిషేకం చేయించడం వల్ల సర్వం సిద్దిస్తుందని అంటారు.శబరిమలకు ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది.ఒకొక్క మెట్టు ఎంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుందో శబరి కొండ మొత్తం కూడా అంతే విశిష్టతను కలిగి ఉంటుందని కూడా అంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube