ఓటీటీ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్న దిల్ రాజు

బాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి దిల్ రాజు.డిస్టిబ్యూటర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమని సాశించే స్థాయిలో దిల్ రాజు తన స్టామినా పెంచుకుంటూ పోయాడు.

 Dil Raju To Start His Own Ott Platform, Vakeel Saab Movie, Tollywood, Corona Sec-TeluguStop.com

ప్రతి ఏడాది దిల్ రాజు బ్యానర్ నుంచి అరడజనుకి తక్కువ కాకుండా సినిమాలు వస్తూ ఉంటాయి.అందులో లో బడ్జెట్ మూవీల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు ఉంటాయి.

ఒక ప్లానింగ్ ప్రకారం సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న దిల్ రాజు ఏపీ, తెలంగాణలో చాలా థియేటర్స్ ని లీజ్ కి తీసుకొని వాటిని తన చేతిలో పెట్టుకున్నాడు.ఇలా చేయడం వలన తన సినిమాకి ఒక సేఫ్ జోన్ ఏర్పాటు చేసుకున్నారు.

అయితే గత ఏడాది నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.కరోనా లాక్ డౌన్ ప్రభావంతో జనాలు ఇంటికే పరిమితం అయిపోయారు.

థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.డిసెంబర్ నుంచి మార్చి వరకు కరోనా ఉపశమనం లభించిందని థియేటర్స్ ఓపెన్ చేసి సినిమాలు రిలీజ్ చేశారు.

ప్రేక్షకులు కూడా కరోనా టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూడటం మొదలు పెట్టారు.అయితే గుంపులుగా ఎలాంటి మాస్క్ లు లేకుండా తిరగడం ఎంత ప్రమాదమో కరోనా సెకండ్ వేవ్ తో అందరికి అర్ధమైంది.

దీంతో భౌతిక దూరానికి ప్రజలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.ఈ నేపధ్యంలో భవిష్యత్తులో థియేటర్స్ కి వెళ్లి సినిమాలు చూసే ఆడియన్స్ సంఖ్య విపరీతంగా తగ్గిపోయే అవకాశం ఉంది.

దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పటికే ఒటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చేశాయి.ఈ నేపధ్యంలో ఫ్యామిలీ అంతా కలిసి ఇంట్లోనే ఉంటూ సినిమాలు చూసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.కొత్త సినిమాలు వేగంగానే ఒటీటీలోకి వచ్చేస్తున్నాయి.అలాగే బాషా పరిమితులు లేకుండా వెబ్ సిరీస్ లు డిఫరెంట్ కథలతో వస్తున్నాయి.

ఈ నేపధ్యం అందరూ ఒటీటీ బాట పట్టేశారు.ఇప్పటికే అల్లు అరవింద్ అహ ఒటీటీ ఏర్పాటు చేసి దూసుకుపోతున్నారు.

ఈ నేపధ్యంలో దిల్ రాజు కూడా ఆ దిశగానే అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు.లీజ్ తీసుకున్న థియేటర్స్ ని వదిలేసుకుంటున్నారు.

వాటి స్థానంలో కొత్తగా ఒటీటీ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారు.కేవలం పెద్ద సినిమాల వరకు థియేటర్స్ కి వెళ్లి, లోబడ్జెట్ సినిమాలని డైరెక్ట్ ఒటీటీ ప్లాన్ చేసుకోవడానికి ఈ దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube