కాంగ్రెస్ లో క్రమంగా తగ్గుతున్న జానారెడ్డి జోక్యం.... మెల్లగా దూరమవుతున్నారా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ఒకప్పటి కాంగ్రెస్ లా తయారయ్యేందుకు రేవంత్ అధ్యక్షతన విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.అయితే కాంగ్రెస్ లో సీనియర్ లకు, రేవంత్ కు మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.

 Janareddy Intervention In The Congress Is Gradually Decreasing In Party Activiti-TeluguStop.com

అయితే కాంగ్రెస్ సీనియర్ లు ఒకప్పుడు పార్టీ గురించి కష్టపడ్డట్టుగా, యాక్టివ్ గా ఉన్నట్టుగా ప్రస్తుతం ఉండడం లేదు.అయితే ఒకప్పుడు కాంగ్రెస్ పెద్ద ఎత్తున బలంగా ఉన్న పరిస్థితులలో, ముఖ్యమంత్రిగా పని చేయడానికి అర్హతలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన పేరు జానా రెడ్డి.

అయితే జానా రెడ్డి తాజాగా నాగార్జున సాగర్ లో పోటీ చేసినా ఓటమి పాలైన విషయం తెలిసిందే.అయితే జానా రెడ్డి గెలవకపోవడానికి పార్టీ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకోవడమే.

అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ లో ఓటమి తరువాత జానారెడ్డి పార్టీలో క్రియాశీలకంగా ఉండడం లేదు.పార్టీ నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలలో కూడా పాల్గొనడం లేదు.

అయితే తన ఎన్నిక సమయంలో కలిసి కట్టుగా కృషి చేయలేదనే భావనతోనే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడన్న విమర్శ ఉంది.అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందనేది తెలియాలంటే జానా రెడ్డి నోరు విప్పితే గాని తెలియదు.

Telugu @kundurujanareddyofficial, Congress Jana, Congresssenior, Jana, Telangana

అయితే జానా రెడ్డి లాంటి సీనియర్ లు ఇప్పటి వరకు ఎలాంటి వివాదాల్లోకి వెళ్లకపోయినా కనీసం కాంగ్రెస్ సీనియర్ నేతగా పార్టీ లో ఉన్న విభేదాలను, సఖ్యతను కుదిర్చే అవకాశం ఉంది.కాని జానారెడ్డి లాంటి సీనియర్ నేతలు చాలా మంది ఇపుడు కాంగ్రెస్ చేస్తున్న ఎటువంటి కార్యక్రమాలలో కూడా యాక్టివ్ గా పాల్గొనడం లేదు.అయితే కాంగ్రెస్ ఎంతలా బలపడినా సీనియర్ ల సలహాల, సూచనలు అవసరం.మరి రానున్న రోజుల్లో జానా రెడ్డి కాంగ్రెస్ లో యాక్టివ్ అవుతారా లేదా చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube