అక్కినేని నాగచైతన్య, శోభితల ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు వీరి ఎంగేజ్‌మెంట్ కు సంబంధించిన వార్తల కంటే వేరే వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
అవేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.చైతూ ఓ సినిమాలో తన జీవితంలోకి ఎస్ అనే అక్షరంతో ఉన్న అమ్మాయే వైఫ్‌గా వస్తుందని అంటాడు.
నిజంగానే ఎస్ అనే ఇనిషియల్ ఉన్న సమంత(Samantha) అతని జీవితంలోకి భార్యగా వచ్చింది.ఆ తర్వాత వెళ్లిపోయింది.
మళ్లీ ఇప్పుడు అతని జీవితంలోకి భార్యగా రాబోతున్న శోభిత (Sobhita)ఇనిషియల్ కూడా ఎస్.చైతు చెప్పిన ఎస్ అనేది నిజమే అయింది.దేని గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు.
జోక్ ఏంటంటే, శోభిత చెల్లె పేరు కూడా సమంతే(samantha).
అందుకే ఇంతకుముందు సమంత అక్కని చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ చాలా సరదా వార్తలు వచ్చాయి.ఇప్పుడు కూడా ఇలాంటి వార్తలు వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
యాక్ట్రెస్ సమంత తాను నాగ చైతన్యకు(Naga Chaitanya) ఆగస్టు 8న ప్రపోజ్ చేసినట్టు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.అంటే ఇప్పుడు అదే తేదీన శోభితతో నాగ చైతన్య నిశ్చితార్థం జరగడం విశేషం.
నాగ చైతన్య లక్కీ నంబర్ 8 అట.అందుకే వీళ్లు ఎనిమిదవ నెల 8వ తేదీన ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ పెట్టుకున్నారు.
కొన్నేళ్ల క్రితం నాగ్ ఏదో ఓ సినిమా ప్రమోషన్‌లో శోభిత sobhitha)చాలా హాట్ అంటూ ఒక రొమాంటిక్ కామెంట్ చేశాడు.ఇప్పుడు అవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కోడలు అంటే కన్న కూతురితో సమానం.కానీ ఆ విషయం అప్పుడు తెలియదు కదా అందుకే నాగార్జున(Nagarjuna) అలా అని ఉంటాడు.
అదే ఇప్పుడు తప్పైపోయింది.ఇలాంటి ఎన్నో వార్తల నడుమ ఒక వార్త మరింత ఇంట్రెస్టింగ్ గా నిలిచింది.
నాగ చైతన్య-ధూళిపాళ శోభిత ఎంగేజ్‌మెంట్ సమంత ఎలా స్పందిస్తుందనేది ఆ వార్త సారాంశం.అంతేకాదు శోభిత ఎవరు, ఆమె క్యాస్ట్ ఏంటి అని ఆరా తీయడం కూడా మొదలుపెట్టారు.
శోభిత అడవి శేషుతో(Sobhita Dhulipala, Adivi Sesh)కలిసి గూఢచారి,(Goodachari ) తరువాత మేజర్ వంటి రెండు తెలుగు సినిమాలు చేసింది.కల్కి 2898ADలో దీపికా పదుకొణెకి వాయిస్ ఓవర్ అందించింది.హిందీలో కూడా తక్కువ సినిమాలే చేసింది.అందువల్ల ఆమె గురించి తెలుగు వారికి పెద్దగా తెలియదు.రెండేళ్లుగా శోభిత, నాగ చైతన్య డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.వారి కలిసి ఉన్న ఒక ఫోటో కూడా వైరల్ అయింది.
కానీ వాటిని వీళ్లు కొట్టి పారేశారు.అందువల్ల అభిమానులు పెద్దగా పట్టించుకోలేదు.
తెలుగమ్మాయి కావడం వల్ల నాగార్జున కూడా వెంటనే ఓకే చెప్పేశాడు.పైగా నాగచైతన్య డివోర్స్ కారణంగా బాధల్లో ఉన్నాడు అందుకే నాగార్జున కాదనలేకపోయాడు.శోభిత స్వస్థలం తెనాలి.ఆమె తండ్రి వేణుగోపాలరావు మర్చంట్ నేవీ ఇంజనీర్‌గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు.ఆమె తల్లి శాంత కామాక్ష్ ఓ టీచర్.బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన శోభిత వైజాగ్‌లో పెరిగింది.
అక్కడే స్కూల్ లైఫ్ కడిగింది.తర్వాత ముంబై వెళ్లి కార్పొరేట్ లా పూర్తి చేసింది.
నాట్యంపై ఇష్టంతో భరతనాట్యం, కూచిపూడిలో ట్రైనింగ్ తీసుకుంది.తర్వాత రకరకాల బ్యూటీ కాంపిటేషన్ లో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది.
తర్వాత సినిమాల్లోకి వచ్చి పాపులర్ అయ్యింది.పొన్నియన్ సెల్వన్‌లో ఓ ముఖ్యమైన పాత్ర పోషించిన తర్వాత ఈమె భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.