వైరల్ : ఈ వీడియో చూస్తే పగలబడి నవ్వాల్సిందే ..!

సోషల్ మీడియాలో ప్రతీరోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి.సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏ వీడియో.ఎప్పుడు… ఎందుకు వైరల్ అవుతుందో మనకు తెలియదు.అందులో ఎన్నో రకాల వీడియోలు ఉంటాయి.

 Cat Sneak Attacks Friend After Hiding In Cupboard,funny Videos, Cat Videos, Vira-TeluguStop.com

అసలు మనం గమనించని చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి.నెటిజన్లు వాటిని ఎక్కువగా చూస్తారు.

లైక్ చేస్తారు.కామెంట్ చేస్తారు.

అందులోనూ జంతువులకు సంబంధించిన వీడియోలు గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తాజాగా ఓ పిల్లికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోని చూస్తే నవ్వి, నవ్వి పొట్ట చెక్కలవ్వాల్సిందే.

ఈ వీడియోలో ఓ పిల్లి నిశ్శబ్దంగా అలా నిలబడి ఉంటుంది.

ఇంతలో కబోర్డ్‌లో దాక్కున్న మరో పిల్లి దానికి తెలియకుండా మెల్లగా చెయ్యితో దానిని కొడుతుంది.దీంతో ముందు నిలుచుని ఉన్న పిల్లి అకస్మాత్తుగా భయంతో వణికి పోతూ.

చుట్టూ చూస్తుంది.అక్కడ దానికి ఏం కనపడదు.

ఆ పిల్లికి ఏం చేయాలో అర్థం కాక.హైరానా పడిపోతుంది.ఈ ఫన్నీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.వీడియోని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.‘కబోర్డ్‌లో దాక్కున్న పిల్లి చాలా తెలివైనదని’ ఒకరు రాయగా.మరొకరు ‘ ఆ పిల్లి చాలా కొంటె పిల్లి’ అని రాశాడు.

మరికొందరైతే అయ్యో పాపం.ఆ పిల్లి భయంతో వణికిపోతోంది అంటూ సానుభూతి వ్యక్తపరిచారు.

ఈ వీడియో మాత్రం నెటిజన్లను చాలా ఆకట్టుకుంది.ఇప్పటికే ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube