కార్తీక దీపం సీరియల్ చైల్డ్ ఆర్టిస్ట్ కు సన్మానం.. యూట్యూబ్ లో వీడియో వైరల్!

బుల్లితెరపై ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. రేటింగ్ విషయంలో అన్ని సీరియల్స్ కంటే మొదటి స్థానంలో ఉంటుంది.

 Karthika Deepam Child Artist Sahruda Honors Video Viral Details, Karthika Deepa-TeluguStop.com

ఈ సీరియల్ ప్రేక్షకులనే కాకుండా సెలబ్రేటిలను కూడా బాగా ఆకట్టుకుంటుంది.ఇక ఇందులో నటించే నటుల గురించి వారి పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇందులో ఎక్కువగా దీప కోసం బాగా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు.అంతేకాకుండా హిమ, సౌర్య పాత్రలే కాకుండా అందరి పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.

ఇక ఇప్పుడు సీరియల్ లో పాత్రలు పెద్దగా అయ్యారన్న విషయం తెలిసిందే.ఇప్పుడు కూడా ఈ సీరియల్ మంచి రేటింగ్ తో కొనసాగుతుంది.ఇదిలా ఉంటే చిన్నప్పుడు హిమ, సౌర్య పాత్రల్లో నటించిన చిన్నారులను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుకు చేసుకుంటూ ఉంటారు.ఇక వాళ్లు సీరియల్ కు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు టచ్ లో ఉన్నారు.

ఇక హిమ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సహృద. మంచి అభిమానాన్ని సంపాదించుకుంది.ఇక సహృద ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.కానీ సోషల్ మీడియా ద్వారా అందరికీ దగ్గరలో ఉంది.

సహృద సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఫోటో షూట్ చేయించుకుంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

అంతే కాకుండా తన డాన్స్ తో బాగా ఆకట్టుకుంటుంది.

సీరియల్ విరామ సమయంలో కూడా బాగా రీల్స్ చేసేది.ఇక అప్పుడప్పుడు బుల్లితెర ఈవెంట్లలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తుంది.ఓసారి తన నిజ జీవితం గురించి చెబుతూ బాగా ఎమోషనల్ కూడా అయింది.

ఇక ఇటీవల యూట్యూబ్ లో కూడా తన పేరు మీద ఓ ఛానల్ క్రియేట్ చేసుకుంది.ఇక అందులో తన వ్యక్తిగత విషయాలతో పాటు మరెన్నో విషయాలు కూడా షేర్ చేసుకుంటుంది.

తను షేర్ చేసుకునే వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతూ ఉంటాయి.అంతే కాకుండా విపరీతమైన లైక్స్ తో పాటు కామెంట్లు కూడా వస్తాయి.

అప్పుడప్పుడు తన ఇన్ స్టా ద్వారా తన అభిమానులతో ముచ్చట్లు కూడా పెడుతుంది.నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా తన యూట్యూబ్ ఖాతాలో మరో వీడియో పంచుకుంది.

ఇక ఆ వీడియోకు విజయనగరంలో నాకు సన్మానం అంటూ కాప్షన్ ఇవ్వగా ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ గా మారింది.ఇక అందులో తను మేకప్ వేసుకునే దగ్గర నుంచి తను సన్మానం అందుకున్న వరకు ఉంది.ఇక ఆ కార్యక్రమానికి వచ్చిన వారంతా తనతో సెల్ఫీలు దిగుతూ బాగా సందడి చేశారు.

అంతేకాకుండా తనకు పలువురు సన్మానం చేయగా.ఆ తర్వాత పలువురు తో కలిసి క్యాట్ వాక్ చేసి చూపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube