ప్రతి ఏడాది దీపావళి మరుసటి రోజు గోవర్ధన పూజను( Govardhan Puja ) జరుపుకుంటారు.దీనిని అనేక ప్రాంతాలలో అన్న కూట్ అని కూడా పిలుస్తారు.
ఈ పండుగకు హిందువుల జీవితంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది అని పండితులు చెబుతున్నారు.ఈ పండుగ ప్రకృతికి మానవులకు మధ్య ఉన్న సంబంధానికి ప్రతిక అని కూడా చెబుతున్నారు.
గోవర్ధన పూజలో గోవులను పూజిస్తారు.అంతే కాకుండా శ్రీకృష్ణుడిని( Sri Krishna ) సాంప్రదాయంగా పూజిస్తారు.
గోవర్ధనుడికి 56 రకల నైవేద్యాలను సమర్పిస్తారు.ఆవుని గోవర్ధనుడిని పూజించడం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది.
ఈ ఏడాది గోవర్ధన పూజ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది.నవంబర్ 13వ తేదీన లేదా నవంబర్ 14వ తేదీన ఈ పూజ జరుపుకోవాలనే విషయంలో గందరగోళం ఉంది.

వేరువేరు రోజులలో శుభముహూర్తాలు రావడంతో ఈ గందరగోళం తలెత్తింది.ఈ సారి నవంబర్ 13, 14 తేదీలలో గోవర్ధన పూజ జరుపుకోనున్నారు.పూజా తిథి నవంబర్ 13వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషములకు మొదలవుతుంది.అలాగే నవంబర్ 14వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఈ తిధి ఉంటుంది.
ముఖ్యంగా చెప్పాలంటే గోవర్ధన పూజ ప్రారంభించడం మొదలుపెట్టడానికి ముందు ఆవు పేడతో( Cow Dung ) ఒక పర్వతాన్ని తయారు చేయాలి.గోవర్ధన పర్వతం( Govardhana Hill ) ఆకారాన్ని తయారు చేయడమే కాకుండా ఆవును కూడా తయారు చేయాలి.
గోవర్ధన పర్వతాన్ని తయారు చేసిన తర్వాత దాని దగ్గర నూనె దీపం వెలిగించాలి.

ఆ తర్వాత పువ్వులు, పసుపు, బియ్యం, చందనం, కుంకుమను సమర్పించాలి.గోవర్ధన పూజా సమయంలో మిఠాయిలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా పంచాలి.పాల పదార్థాలతో తయారు చేసిన తర్వాత ఆహార పదార్థాలను కన్నయ్య గోవర్ధన పర్వతానికి సమర్పించిన తర్వాత ముకుళిత హస్తాలతో గిరిధరుడిని ప్రార్థించాలి.
ఆ తర్వాత గోవర్ధన పూజకు సంబంధించిన కథను చదవాలి.ఇవన్నీ సమర్పించిన తర్వాత గోవర్ధన ఉత్సవానికి ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి.ఇలా చేయడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడు.తనను పూజించిన భక్తులను అనుగ్రహిస్తాడు.
గోవర్ధన పూజ రోజున ఆవును, శ్రీకృష్ణుని పూజిస్తే ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి, సిరిసంపదలకు లోటు ఉండదని చాలామంది ప్రజలు నమ్ముతారు.