ఏదైనా రాసేటప్పుడు శ్రీ అని ఎందుకు రాస్తారో తెలుసా..?

మన భారతదేశంలో ఉన్న దాదాపు చాలా మంది ప్రజలు చాలా రకాల సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తారు.మరి కొంత మంది ప్రజలు వీటిని మూఢనమ్మకాలుగా భావిస్తూ ఉంటారు.

 Why Sri Is Written While Writing Something Details, Sri , Writing , Sri Karam, S-TeluguStop.com

మన దేశం ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నా కొంత మంది ప్రజలు మాత్రం ఆచారాలను, సంప్రదాయాలను కఠినంగా పాటిస్తున్నారు.మన దేశంలో చాలా మంది ప్రజలు పాటించే ఆచారాలలో ముఖ్యమైనవి చాలానే ఉన్నాయి.

ముఖ్యంగా చెప్పాలంటే చాలా మంది ఏదైనా కొత్త పుస్తకం కొన్న, ఏదైనా రాయాలనుకున్న, ఏదైనా మంచి పని చేసినా శ్రీ కారంతో( Sri Karam ) మొదలు పెడతారు.

ఇంకా చెప్పాలంటే ఇలా రాస్తే మంచిది అని మొదలు పెడతారు కానీ నిజంగా దాని అర్థం ఏమిటో చాలా మందికి తెలియదు.దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.శ్రీ అంటే లక్ష్మీ ప్రియమైనది.

శ్రీ కారంతో ప్రారంభించిన ఏ కార్యమైనా జయం పొందుతుంది.క్షేమం కలుగుతుంది.

ఏ కార్యక్రమం అయినా ప్రారంభించడానికి శ్రీ కారం చుట్టారు అని అంటాము.శ్రీ శబ్దానికి శోభా, శాంతి అని అర్ధాలు వస్తాయి.

విశ్వంలో ఏది అంతిమమో, ఏది అనాదియో అది శ్రీ.దాని గురించే తెలుసుకునే విద్యనే శ్రీ విద్య( Sri Vidya ) అని కూడా అంటారు.

శ్రీ విద్యా అనగా అమ్మవారి ఉపాసకులు అని కూడా అంటారు.సాక్షాత్తు త్రిమూర్తులకు ఆశ్రయం ఇచ్చే శక్తిని శ్రీ( Sri ) అని అంటారు.అందువల్ల ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు ముందుగా శ్రీ కారం రాయడం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం ఆ కార్యంపై ఉండడం వల్ల ఆ శుభకార్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుందని చాలా మంది ప్రజలు భావిస్తారు.ప్రస్తుతం గౌరవవాచకంగా, శుభప్రదమైనదిగా శ్రీ ఉపయోగిస్తున్నారు.

ఇది ఒక బీజాక్షరం కూడా, శ్రీ మంగళకరమైనది, మోక్షదాయకమైనదని అని పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube