మన దేశవ్యాప్తంగా చాలా మంది ప్రజలు సంక్రాంతి పండుగను వారి కుటుంబ సభ్యులందరితో పాటు ఎంతో సంతోషంగా, వైభవంగా జరుపుకుంటారు.కానీ ఈ సంక్రాంతికి ఒక ప్రాముఖ్యత ఉంది.
అది ఏమిటంటే సంక్రాంతి, కాలాష్టమి అంటే అష్టమి తిధి ఒకేరోజు వచ్చాయి.అందుకే జనవరి 15వ తేదీన సూర్యునితో పాటు కాలభైరవ పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
సంక్రాంతి పండుగ రోజు ఉదయం పూట సూర్య భగవంతుడిని, సాయంత్రం పూట కాలభైరవ పూజను చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు అని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే సంక్రాంతి రోజున వచ్చే అష్టమి రోజున సూర్యభైరవులకు వ్రతం ఆచరించడం కూడా మంచిదే.
సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి నేతితో దీపం వెలిగించాలి.పాలు నైవేద్యంగా సమర్పించాలి.

కాలభైరవ అష్టకాన్ని ఆదిత్య హృదయాన్ని పాటించడం మంచిది.సాయంత్రం పూట కాలభైరవ దేవాలయాన్ని సందర్శించి నేతితో దీపం వెలిగించడం ద్వారా సర్వ శుభాలు జరుగుతాయి.మాంసాహారం తీసుకోకుండా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది.వీలైతే కాలభైరవునికి అభిషేకానికి పాలు ఇవ్వడం లాంటివి చేయవచ్చు.మిరియాలతో దీపం వెలిగించవచ్చు.భైరవుడిని ఆరాధించడం ద్వారా పాపాలు దూరమవుతాయి.
ఆందోళనలు, మానసిక రుగ్మతలు దూరమవుతాయి.ముఖ్యంగా ఒక వ్యక్తి జాతకంలో శని, రాహువు, కేతువు, దోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి.
సరైన శుభ ముహూర్తంతో భగవంతుని పూజించడం వల్ల దురదృష్టకరమైన ప్రభావాలు కూడా దూరమైపోతాయి.ఈ పూజ ఒక వ్యక్తి క్రమంగా ప్రశాంతత, శాంతి వైపు ముందుకు సాగడానికి ఉపయోగపడుతుందని వేద పండితులు చెబుతున్నారు.